కృష్ణా డెల్టాకు సాగు, తాగునీరు, నీటి ఆవిరితో కలిపి ఈ ఖరీఫ్ సీజన్‌లో 155.40 టీఎంసీలు కావాల్సి ఉంది. గత ఏడాది కృష్ణా డెల్టాకు 134.62 టీఎంసీలు విని యోగించారు. పులిచింతలలో ఉన్న మొత్తం నీటిని ఖాళీ చేశారు. ఇప్పుడు ఎగువున ఉన్న ప్రాజెక్టులన్నీ నిండితే తప్ప అది నిండే పరిస్థితి లేదు. గత ఏడాది మూసీ వరద రావడంతో 32. 67 టీఎంసీల నీరు అదనంగా వచ్చింది. వరదల వల్ల వచ్చిన జలాలను సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మధ్య నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో మొత్తం సముద్రంలోకి వెళ్లిపోతోంది.