హీరోలకి ధీటుగా క్రేజ్ ని సంపాదించే హీరోయిన్ రావడంలేదని అందరు అనుకుంటున్నవేళ మై హునా అని చెప్పిన తార సమంత(samantha)కాకపోతే ప్రెజంట్ తన హవా కొంచం తగ్గింది. కానీ క్రేజ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందుకు సాక్ష్యమే తాజాగా ఆమె అందుకున్న రెమ్యునరేషన్.
సమంత రీసెంట్ గా సిటాడెల్ హనీ బన్నీ(citadel honey bunny) అనే వెబ్ సిరీస్ చేసింది. హాలీవుడ్ హిట్ సిరీస్ సిటాడెల్ కి రీమేక్ గా వస్తుంది. ఇప్పుడు ఈ సిరీస్ కి సమంత అక్షరాలా 10 కోట్ల రూపాయలని అందుకుంది. ఇప్పుడు ఈ విషయం ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో టాపిక్ అయ్యింది. అంతే కాదు సమంత రేంజ్ ఎలాంటిదో చాటి చెప్పింది. ఇక సామ్ అభిమానులు అయితే పది కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారంటే సామ్ ది వెరీ వెరీ బిగ్ రోల్ అయ్యుంటుందని, మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతుందని అంటున్నారు. ఫ్యామిలీ మాన్ సిరీస్ ని మించి కూడా అని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్(varun dhavan)హీరోగా చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రాజ్ డి కె ద్వయం(raj dk) దర్శకులు కాగా అమెరికా కి చెందిన ఆంథోనీ రుస్సో (anthony russio)జోసెఫ్ రుస్సో (joseph russio)లు నిర్మాతలు.
ఇక ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో సమంత గురించి మరో చర్చ కూడా నడుస్తుంది. హానీ బన్నీ కంటే ముందే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత తన సినిమాలో చెయ్యమని సమంత కి భారీ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేసాడంట. పది కోట్లు కంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్దపడ్డాడంట. పైగా లాభాల్లో 25 శాతం వాటా ఇస్తానని కూడా చెప్పాడంట. కానీ సమంత ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది.