దిశ, ఫీచర్స్: బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఖాళీ కడుపుతో తీసుకుంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
రోగనిరోధక శక్తి
బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. మీ ఇమ్యూనిటీని పెంచుతుంది. పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
చర్మ ఆరోగ్యం
బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. దీంతో మీ ముఖం మెరిసిపోతుంది. బొప్పాయిని రోజూ తీసుకోవడం వల్ల మీ ముఖం కూడా మెరుగుపడుతుంది.
డిటాక్సిఫికేషన్
బొప్పాయిలో ఫైబర్, పోషక ఎంజైములు పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మలబద్ధకం
బొప్పాయి దీర్ఘకాలిక మలబద్ధకానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఫైబర్ కంటెంట్, జీర్ణ ఎంజైమ్‌లు మలబద్ధకానికి సహజ నివారణగా పనిచేస్తాయి.
గుండె ఆరోగ్యం
బొప్పాయిలో ముఖ్యమైన ఖనిజమైన పొటాషియం ఉంటుంది. ఉదయం పూట బొప్పాయి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది అలాగే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.