Health Care

పరీక్షలో విద్యార్థి రాసిన ఆన్సర్.. నెట్టింట వైరల్.. అందులో ఏముందంటే..


దిశ, ఫీచర్స్ : స్కూల్, కాలేజీ జీవితం ప్రతి ఒక్క విద్యార్థి, అలాగే ప్రతి ఒక్క టీచర్ కు ఎన్నో అందమైన జ్ఞాపకాలను అందిస్తుంది. అలాగే ఎన్నో రకాల అనుభవాలను కూడా కలిగిస్తుంది. ఇక పరీక్ష సమయంలో ఏదైనా ప్రశ్నకు సమాధానాలు తెలియకపోతే ఆ ప్రశ్నను వదిలేస్తారు. లేదా మనకు తెలిసిన విషయాన్ని రాసేస్తారు. అలాగే కొంతమంది విద్యార్థులు మాత్రం ఏ ప్రశ్నకైనా మంచి సమాధానాన్ని రాస్తారు. అలాంటి సమాధానాలు కొన్ని సార్లు ఉపాధ్యాయులకు నవ్వు తెప్పిస్తే మరికొన్ని టీచర్లను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ఒక ఆన్సర్ షీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ స్టూడెంట్ ఏం రాశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ విద్యార్థి సమాధాన పత్రంలో తనకు ఎంతో ఇష్టమైన ఓ టీచర్ పై వ్యాసం రాశాడు. ఇంతకీ అందులో ఏముందంటే మాకు టీచర్లందరూ చాలా ఇష్టం. కానీ ఎక్కువ ఇష్టమైన టీచర్ భూమిక మేడమ్. ఈ టీచర్ మాకు ఎన్నో మంచి విషయాలను నేర్పిస్తారు. మమ్మల్ని ఎంతో, ప్రేమగా ఆప్యాయంగా చూస్తారు. అలాగే పిల్లలు మనస్ఫూర్తిగా చదువుకునేలా అలాంటి గురువును దేవుడు అందరికీ ప్రసాదించాలని రాశాడు. అలాగే చివరగా ఐ లవ్ యు భూమి మేడమ్ అని విద్యార్థి వ్యాసాన్ని ముగించాడు. ఈ పోస్ట్ ను @Rajputbhumi157 అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు.





Source link

Related posts

Milk : పాలు తాగడానికి సరైన సమయం ఏదో తెలుసా?

Oknews

చేప గుడ్లతో తయారయ్యే క్లాస్ట్లీ వంటకం.. ఒక ప్లేట్‌ ధరెంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

Oknews

వేసవిలో మీ పిల్లలను ఇతర చోట్లకు పంపుతున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Oknews

Leave a Comment