EntertainmentLatest News

పవన్‌ అలా చేస్తే రేణుదేశాయ్‌ అన్‌లక్కీనా.. అది ఎలాగో చెప్పండి!


పవన్‌కళ్యాణ్‌, రేణుదేశాయ్‌ విడిపోయిన తర్వాత అభిమానులు బాధపడిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణుకి ఈ విషయంలో రకరకాల పోస్టులు పెడుతుంటారు ఫ్యాన్స్‌. వారి విడాకుల గురించి చాలా సందర్భాల్లో వివరణ ఇచ్చారు రేణు దేశాయ్‌. అయినా పవన్‌ ఫ్యాన్స్‌ కామెంట్లు మాత్రం ఆగడం లేదు. పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు రేణు దేశాయ్‌. దానికి ఓ నెటిజన్‌ ‘మీరు అన్‌లక్కీ మేడమ్‌’ అని పెట్టాడు. దీనిపై స్పందించిన రేణు ‘నేను ఎలా అన్‌లక్కీ అనేది ఒకసారి చెబుతారా? మీ సమాధానం కోసం ఎదుచూస్తున్నా’ అని సమాధానమిచ్చారు.

అంతటితో ఆగని రేణు ‘నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే అది నా తప్పెలా అవుతుంది. నేను అన్‌లక్కీ ఎలా అవుతాను.. ఇలాంటి కామెంట్స్‌ వినీ వినీ నాకు విసుగొస్తోంది. అదృష్టం అనేది ఒక వ్యక్తితో ముడిపడి ఉండదు. ఇప్పటివరకు నాకు జీవితంలో దక్కిన దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. లేని దాని గురించి ఎందుకు బాధపడాలి. పురుషుడైనా, స్త్రీ అయినా విడాకులు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు అన్‌లక్కీ కాదు. ఇప్పటికైనా మీరు ఈ విషయం తెలుసుకుంటే మంచిది’ అంటూ నెటిజన్లకు హితబోధ చేసింది. 



Source link

Related posts

దర్శకులకి కోపం తెప్పిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్!

Oknews

సినీజోష్ రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్

Oknews

Kalki 2098 AD hashtag trends on X మొదలెట్టారుగా ప్రభాస్ ఫాన్స్

Oknews

Leave a Comment