Ysrcp Suspended Chittoor Mla : చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu)… జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ లో ఆరణి శ్రీనివాసులు పవన్ కల్యాణ్ ను కలిశారు. నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ల మార్పుచేర్పుల్లో చిత్తూరు అసెంబ్లీ ఇన్ ఛార్జ్ గా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో వైసీపీపై అసంతృప్తిగా ఉన్న ఆరణి శ్రీనివాసులు… ఆ పార్టీని విడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన పవన్ తో భేటీ అయ్యారని, త్వరలోనే ఆరణి జనసేనలో చేరనున్నట్లు సమాచారం.