పవన్ కళ్యాణ్( pawan kalyan)కొడుకు అఖీరానందన్, ఆద్య లు రేణు దేశాయ్ దగ్గర ఉంటున్నా కూడా మెగా ఫ్యామిలీ లో జరిగే అన్ని సెలెబ్రేషన్స్ కి హాజరవుతారు. తాజాగా మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్ని జరుపుకుంది. ఈ సందర్భంగా పవన్ కొడుకు అకీరా చేసిన పని ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది.
మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ ని బెంగళూరులో జరుపుకుంది. ఈ వేడుకలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్,అల్లు అర్జున్, అల్లు అరవింద్ తో పాటు మెగా మేనల్లుళ్లు అండ్ ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో అకీరానందన్ నయా హిట్ మూవీ యానిమల్ లోని నాన్న నువ్వు నా ప్రాణం అనే సాంగ్ ని పియానో మీద వాయించాడు. దీంతో అక్కడున్న వారందరు అఖీరా టాలెంట్ కి ఫిదా అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అఖీరా వీడియో ట్రెండ్ సెట్లో ఉంది
పవన్ ఫ్యాన్స్ అయితే అఖీరాకి తన తండ్రి పవన్ అంటే ఎంత ప్రాణమో ఆ పాట ద్వారా చెప్తున్నాడని అంటున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ లో తన తండ్రి వారసత్వాన్ని కూడా అఖీరా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు.