ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)బ్రదర్, స్టార్ ప్రొడ్యూసర్ అరవింద్(allu aravind)కొడుకు అనే టాగ్ లైన్ నుంచి బయటపడి,తనకంటూ సొంత ఇమేజ్ ని సంపాదించటానికి చూస్తున్న హీరో అల్లు శిరీష్. 2013 లో వచ్చిన గౌరవం ఆయన ఫస్ట్ మూవీ.ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబిసిడి ,ఉర్వశివో రాక్షసీవో వంటి విభిన్న చిత్రాలు చేసాడు. ఇప్పుడు లేటెస్ట్ గా బడ్డీ (buddy)తో రాబోతున్నాడు.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు.
తాజాగా బడ్డీ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరిగింది. అందులో పాల్గొన్న శిరీష్ మాట్లాడుతు నాకు ఇష్టమైన బడ్డీ మా అన్నయ్య అర్జున్. చిన్నప్పటి నుంచి విషయం ఏదైనా ముందు అన్నయ్యకే చెప్తాను. అలాగే పవన్ కళ్యాణ్ నుంచి మానసిక స్థైర్యాన్ని నేర్చుకుంటాను. ఆయనకీ ఉన్నంత మానసిక స్థైర్యం ఎవరకి లేదు.అలాగే చిరంజీవి(chiranjeevi) కి పాజిటివ్ ఎక్కువ. అందరితోను మర్యాదగా ఉంటారని చెప్పాడు. అలాగే తన తండ్రి అల్లు అరవింద్(allu aravind)గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసాడు. మా నాన్న రోబోలాగా అన్ని పనులు సమయానికి పూర్తి చేస్తాడు. భర్త, తండ్రి, స్నేహితుడు, నిర్మాత, వ్యాపారవేత్త ఇలా ప్రతి బాధ్యతని వంద శాతం పూర్తి చేస్తారని చెప్పుకొచ్చాడు.
ఇక బడ్డీ మూవీ అగస్ట్ 2 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేష్ సింగ్ హీరోయిన్లు కాగా శ్యామ్ అంటోన్(syam anthon)దర్శకుడు. స్టూడియో గ్రీన్ పతాకంపై అగ్ర నిర్మాత కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీకి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించబడ్డాయి.చూసిన ప్రతి ఒక్కరు బడ్డీ బాగుందనే కితాబు ని ఇస్తున్నారు. ఇక మేకర్స్ టికెట్ రేట్స్ కూడా తగ్గించారు.