మార్కెట్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ వచ్చేసింది. భగత్ బ్లేజ్ అంటు అలా రిలీజ్ అయ్యిందో లేదో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. నిమిషం వ్యవధి ఉన్న టీజర్ లో పవన్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. డైలాగ్స్ కూడా వేరే లెవల్లో ఉన్నాయి. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక హీరోయిన్ వాళ్ళని డిస్ట్రబ్ చేస్తుంది.
పూనమ్ కౌర్..ఇంటర్నెట్ పుణ్యమా అని ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. పవన్ ఫ్యాన్స్ కైతే ఇంకా బాగా తెలుసు.కెరీర్ ప్రారంభంలో మంచి సినిమాలే చేసింది. కారణాలు తెలియదు గాని ఆ తర్వాత హఠాత్తుగా సినిమాలు తగ్గాయి. ఇక అక్కడ్నుంచి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా బాగా పాపులర్ అయ్యింది. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ గురించి ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ పేరుని మాత్రం ఆమె ప్రస్తావించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని మాత్రం ఆకాశానికి ఎత్తేసింది. కమర్షియల్ సినిమాలంటే నువ్వు ఉండాల్సిందే.. నువ్వు లేకపోతే అలాంటి సినిమాలు అసంపూర్ణం అంటూ దేవిని పొగిడింది. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ పూనంపై గుర్రుగా ఉన్నారు. దేవి సూపర్ ఆర్ఆర్ ఇచ్చాడు.ఇది ఎవరు కాదనరు. కాకపోతే పవన్ గురించి ప్రస్తావించకపోవడం దారుణం అంటు మండిపడుతున్నారు. ఇదంతా పూనమ్ కావాలనే చేస్తుందని ఎప్పుడూ పబ్లిక్ నోళ్ళల్లో నానడం తనకి సరదా అని కూడా అంటున్నారు.
కాకపోతే పూనమ్ మెంటాలిటీ తెలిసిన వాళ్ళు మాత్రం మరో విధంగా చెప్తున్నారు. మొన్నీ ఈ మధ్య నా గురించి ఆలోచించే ఒకే ఒక వ్యక్తి త్రివిక్రమ్ అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఈ మాట పూనమ్ కి నచ్చి ఉండదు. ఎందుకంటే తనకి వీలు చిక్కినప్పుడల్లా త్రివిక్రమ్ ని ఒక రేంజ్ లో తిడుతుంటుంది. ఈ మధ్య కూడా త్రివిక్రమ్ పై ఎన్నో ఆరోపణలు చేసింది.ఏది ఏమైనా పూనమ్ స్టైలే వేరు.