EntertainmentLatest News

పవన్ కళ్యాణ్ పై తమిళ నటుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్


పవర్ స్టార్  పవన్  కళ్యాణ్(pawan kalyan)ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే విధంగా పలు శాఖలకి మంత్రిగాను కొనసాగుతున్నారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ యావత్తే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీ ఎంతో గర్వకారణంగా భావిస్తుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య  చెప్పిన మాటలతో ఆ విషయం మరోసారి రుజవయ్యింది.


తాజాగా  కమల్ హాసన్(kamal haasan)హీరోగా వస్తున్న భారతీయుడు 2 (bharathiyudu 2) ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అందులో సూర్య మాట్లాడుతు దేశం మంచి గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు భారతీయులే అని చెప్పాడు. అలాగే పవన్ గురించి కూడా కొన్ని గూస్ బంప్స్ వ్యాఖ్యలు చేసాడు. పవన్ నా స్నేహితుడు. కొన్ని సంవత్సరాల క్రితమే  ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నాను. ఇప్పుడు డిప్యూటీ తో సగమే తీరింది. మిగతా సగం కూడా నెరేవేరే రోజు వస్తుందని చెప్పాడు. సూర్య, పవన్ కాంబోలో గతంలో ఖుషి, కొమరం పులి సినిమాలు వచ్చాయి. ఇక నటుడుగా కూడా సూర్య తన సత్తా చాటుతూ వస్తున్నాడు. భారతీయుడు 2 లో కూడా ఒక పవర్ ఫుల్ పాత్ర పోషించాడు. జులై  12 న వరల్డ్ వైడ్ విడుదల అవుతుండగా శంకర్(shankar)దర్శకుడు.

 



Source link

Related posts

Ayodhya Ram Mandir Is it Benefit to BJP అయోధ్య.. బీజేపీకి మైలేజ్ తెస్తుందా..

Oknews

Pawan is taking pride in Nagababu! పవన్ పరువు తీస్తున్న నాగబాబు!

Oknews

Bad ratings for RP fish pulusu RP చేపల పులుసుకి దారుణమైన రేటింగ్స్

Oknews

Leave a Comment