EntertainmentLatest News

పవన్ కళ్యాణ్, ప్రభాస్ ని  నిలబెట్టిన విజయ్ దేవరకొండ, ప్రియదర్శి


విజయ్ దేవరకొండ(vijay devarakonda)ప్రియదర్శి(priyadarshi)..2016 లో వచ్చిన పెళ్లి చూపుల ద్వారా ఒకే సారి ఫేమ్ లో కి వచ్చారు. సిల్వర్ స్క్రీన్ వద్ద  ఈ ఇద్దరి కాంబోకి మంచి క్రేజ్ కూడా ఉంది. అర్జున్ రెడ్డి, బలగం లతో  హీరోగా ఫుల్ క్రేజ్ ని కూడా సంపాదించారు. తాజాగా ఈ ఇద్దరు గురించి సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. కాగల కార్యం గంధర్వులే తీర్చారు  అని  కూడా అంటున్నారు.మరి అదేంటో చూద్దాం.

గత సంవత్సరం విజయ్ దేవరకొండ ఖుషి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చి పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి ఖుషి పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్(pawan kalyan) ఖుషి(khushi)నే ప్రేక్షకుల మైండ్ లలో మెదులుతుంది. అలాంటిది ఫామ్ లో ఉన్న  దేవరకొండ ఖుషి ని స్టార్ట్ చెయ్యగానే చాలా మంది పవన్ ఖుషిని మర్చిపోతారేమో అనుకున్నారు. పవన్ ఫ్యాన్స్ కూడా అది నిజమవుతుందేమోనని అనుకున్నారు. ఎందుకంటే పవన్  ఖుషి  టూ థౌజండ్ (2000 ) లో వచ్చింది. అంటే రెండు దశాబ్దాల పైనే అవుతుంది. దీంతో విజయ్ ఖుషి సూపర్ డూపర్ హిట్ అయ్యి పవన్ ఖుషి  నామధేయాన్ని వెనక్కి నెడుతుందేమో  అని భావించారు. పైగా  లక్కీ హీరోయిన్ సమంత ఉండనే ఉంది. కానీ భారీ డిజాస్టర్ గా నిలిచి పవన్ ఖుషి ని మాత్రమే ప్రేక్షకుల మైండ్ లో భద్రంగా ఉంచిందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక ప్రియదర్శి విషయానికి వస్తే రీసెంట్ గా డార్లింగ్(darling) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రిలీజ్ ముందు వరకు కూడా డార్లింగ్ అంటే ప్రభాస్(prabhas)నే.  2010 లో ప్రభాస్ హీరోగా వచ్చిన డార్లింగ్  చాలా పెద్ద విజయమే సాధించింది. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇప్పటికి ఒక  మెమోరిబల్ మూవీగా డార్లింగ్ ఉంది.నిజానికి ప్రభాస్ ఖాతాలో డార్లింగ్ కంటే ఎన్నో భారీ హిట్స్ ఉన్నాయి. కానీ ప్రభాస్ ని  కంప్లీట్  ఫ్యామిలీ అండ్ లవర్ బాయ్ గా  ఎస్టాబ్లిష్ చేసింది డార్లింగ్ అని వాళ్ల నమ్మకం. ఇక ప్రియదర్శి డార్లింగ్ రాకతో ప్రభాస్ డార్లింగ్ గుర్తుండదేమో అని  అనుకున్నారు. కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద నయా డార్లింగ్  పరాజయం దిశగా పయనిస్తుందని  ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ ల క్రెడిట్ ని విజయ్ దేవరకొండ, ప్రియదర్శి లు నిలబెట్టారని ఫ్యాన్స్ అంటున్నారు. 

 



Source link

Related posts

This is Jagananna politics ఇదేం రాజకీయం జగనన్నా..

Oknews

‘మోడ్రన్‌ మాస్టర్స్‌’.. మనకు తెలిసింది కొండంత.. ఇందులో చూపించింది గోరంత!

Oknews

అందుకే కమర్షియల్ వైవు అడుగులు: మెగాస్టార్

Oknews

Leave a Comment