పవన్ కళ్యాణ్ తో స్నేహాన్ని మైంటైన్ చేసేందుకేనే నటుడు ఆలీ వైసీపీ కి రాజీనామా చేసింది, గత ప్రభుత్వంలో ఎమ్యెల్యే లేదా ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన ఆలీ వైసీపీ మీద అలిగేనా వైసీపీ కి రాజీనామా చేసింది, లేదంటే జగన్ తనని పట్టించుకోలేదు, ఇక ఇప్పుడు అధికారం లేదు మనకెందుకు జగన్ సాన్నిహిత్యం అనుకున్నాడా.. ఏది ఏమైనా ఆలీ వైసీపీ కి రాజీనామా చెయ్యడమే కాకుండా రాజకీయాలకి గూడ్ బై చెప్పడం ఇకపై అంతా సినిమానే అన్నట్టుగా మాట్లాడడం మాత్రం షాకివ్వకపోయినా చర్చనీయంశమైంది.
పవన్ కళ్యాణ్ జనసేనలోకి చేరకపోయినా.. పవన్ పై పోటీ చెయ్యడానికి సిద్ధమన్న అలీ ఇప్పుడు సైలెంట్ గా రాజకీయాల నుంచి తప్పుకోవడం వెనుక ఆయన పవన్ స్నేహాన్ని కోరుకుంటున్నాడేమో, కానీ నీలాంటి వారిని పవన్ తన పంచన చేరనివ్వరు, తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన నాదెండ్ల మనోహర్ అసలు స్నేహితుడు, ఓడిపోయి రాజకీయాల్లో పోరాడుతున్న తన వెంట వున్న త్రివిక్రమ్, ఆనంద్ సాయి వంటివారు స్నేహితులు నువ్వు కాదు అంటూ పవన్ ఫ్యాన్స్ అలీ ని సోషల్ మీడియాలో ఏసుకుంటున్నారు.
వైసీపీ లో ఉన్నా మనుగడ ఉండదు, ఒకవేళ రాజీనామా చెయ్యకపోతే సినిమా కెరీర్ ఉండదనే నువ్వు రాజీనామా చేసావు. నువ్వు రాజకీయాలు నుంచి తప్పుకున్నా మా పవన్ సినిమాల్లో స్థానమనేది నీ కలే అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తానెవరిని వ్యక్తిగతంగా దూషించలేదు, టార్గెట్ చేయలేదు, తన నాయకుడిని పొగిడాను అంతే అని అలీ చెప్పడం వెనుక పవన్ పవర్ లో ఉన్నారు, పార్టీలో చేరకపోయినా పక్కన ఉంటే చాలనుకుని వైసీపీ కి బై బై చెప్పేసాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.