పవన్ కళ్యాణ్ రాజకీయంగా గెలిస్తే తన పేరు మార్చుకుంటాను.. ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మారుతానని శపధం చేసిన ముద్రగడ అనుకున్నట్టుగానే తన పేరు మార్చుకున్నారు. నిన్న ఇచ్చిన మాట నిలుపుకుంటూ ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరును మార్చేసుకున్నారు. తాజాగా ఆయన మరోసారి పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేసాడు. పవన్ తనకి సీటు ఇవ్వని కారణంగా వైసీపీ లోకి చేరిన ముద్రగడ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడేవాడు. ఇప్పుడు పవన్ కి రిక్వెస్ట్ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించాడు.
ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడల్లో నడుస్తున్నాయి, మీరే కాపులకు న్యాయం చేయండి, నేను మాటిచ్చినట్టుగా నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నాను, ఎన్నికలు అయిపోయాయి, అయినప్పటికీ జన సైనికులతో నామీద బూతులతో దాడులు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు, పవన్ కళ్యాణ్.. మీరే మీ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి అంటూ పవన్ ను రిక్వెస్ట్ చేస్తున్నాడు.
మీకు కోపం ఉంటే.. నా కుటుంబాన్ని మీ జనసైనికులు చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు, ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టిడిపి పార్టీకి సూచనలు చేయాలి అంటూ ముద్రగడ గత ప్రభుత్వంలో ఎలాంటి దాడులు జరగనట్టుగా చిలకపలుకులు పలకడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి దాడులు ప్రతిపక్షాలపై జరగలేదా.. అప్పుడు మాట్లాడని పెద్దాయన ఇప్పుడు ఇలా మాట్లాడడం విడ్డురంగా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.