రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని పిల్లలు అకీరా, ఆద్యలతో సపరేట్ గా ఉంటుంది. మధ్యలో ఆమె రెండో పెళ్లి అని హడావిడి చేసినా.. అది జరగలేదు. ఇక పవన్ కళ్యాణ్ లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యి మరో పెళ్లి చేసేసుకున్నారు. పవన్ తో విడిపోయిన రేణు దేశాయ్ ని పవన్ ఫ్యాన్స్ అప్పుడప్పుడు తెగ ఇరిటేట్ చేస్తూ ఉంటారు, అయినప్పటికీ వారందరికి రేణు దేశాయ్ దిమ్మతిరిగే కౌంటర్లు వేస్తూనే ఉంటుంది.
ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలుపు సాధించగా.. పవన్ విజయోత్సవాల్లో భాగమయ్యేందుకు కొడుకు అకీరా, కుమార్తె ఆద్యలని పంపించడమే కాకుండా.. మై బేబీస్ హ్యాపీ అంటూ కొడుకు, కూతురు ఫోటొస్ ని పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజున పోస్ట్ చేసింది రేణు.
అయితే తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో గణపతి హోమము జరగగా తాను స్వయంగా దేవుడికి ప్రసాదం చేస్తానని అంటూ కుకింగ్ వీడియో పోస్ట్ చెయ్యగా.. ఆ వీడియోలో రేణు దేశాయ్ చక్కని చీరకట్టులో మెరిసిపోయింది. అయితే ఆ వీడియో కింద పవన్ ఫ్యాన్ ఒకరు.. వదిన గారు మీరు కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని వివాహం చేసుకుని ఆయన మనసులో ఏముందో తెలుసుకోకుండా వెళ్లిపోయారు. మీకు ఈరోజు ఆయన విలువ తెలిసింది. ఏదేమైనా విధి ప్రతిదీ డిసైడ్ చేస్తుంది. ఆయన విజయం సాధించిన రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు.. అది చాలు వదిన. వీ ఆర్ మిస్సింగ్ యూ వదిన అంటూ కామెంట్ పెట్టాడు,
దానికి రేణు దేశాయ్ కాస్త కోపంగానే రిప్లై ఇచ్చింది. మీకు కొంచెం కూడా బుద్ధి, జ్ఞానం ఉన్నా ఇలా మాట్లాడరు.. నేను కాదు ఆయన్ని వదిలేసింది. ఆయన నను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను ఇలా టార్చర్ చేయొద్దు 🙏 అంటూ రేణు దేశాయ్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది.