GossipsLatest News

పవన్ పై మహేష్ మాటల దాడి


ప్రతి పార్టీలోనూ ఎమ్యెల్యే టికెట్ కానీ, ఎంపీ టికెట్ కానీ దక్కని అభ్యర్థులు ఆ పార్టీలకి రాజీనామా చేసి బయటికి పోవడం అనేది సర్వసాధారణం. కొంతమంది కామ్ గా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతే.. మరికొంతమంది వెళుతూ వెళుతూ ఆ పార్టీని దుమ్మెత్తిపోసి మరీ మరో పార్టీలో చేరేందుకు తయారవుతారు. తాజగా జనసేన పార్టీకి పోతిన మహేష్ గుడ్ బై చెప్పడం అటుంచి పవన్ కళ్యాణ్ పై ఎంత కక్ష ఉందొ అది మొత్తం మీడియా ముందు కక్కేసాడు. 

PK మిమ్మల్ని గొర్రెలను చేస్తున్నాడు అని నేను లక్షల సార్లు చెప్పా … వింటేగా అంటూ మొదలు పెట్టిన పోతిన మహేష్.. రేపు పిఠాపురంలో కొన్న ఇంటికి పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా తో కలిసి గృహప్రవేశానికి రావాలి.. ఇదొక్కటే నా కోరిక! అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. అంతేకాకుండా త్వరలోనే జనసేనాని టీడీపీ లో కలిపేందుకు పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.  

6 నెలల్లో జనసేనని టీడీపీలో విలీనం చేసేస్తారు.  

గెలిచే స్థానాలు వదిలేసి ఓడిపోయే స్థానాలు తీసుకున్న మేధావి పవన్ కళ్యాణ్. తెనాలి సీటు ఎందుకు త్యాగం చేయలేదు ? కమ్మ వారు త్యాగాలు చేయరా ? బిసిలే చేయాలా ? 

పవన్ కళ్యాణ్ పెద్ద స్వార్థపరుడు, మాయగాడు. ప్రజలు తెలివైన వారు అందుకే రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారు 

పవన్ నన్ను రాజకీయంగా చంపేశాడు, ఇది నాకు పునర్జన్మ, ఏ పార్టీలో చేరతానో, ఏ జెండా మోస్తానో నా ఇష్టం. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న వాళ్లంతా మూడు జెండాలు మోసిన వారే. 

25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అన్నారు, 25 రోజుల తరువాత అసలు జనసేన భవిష్యత్తు ఏంటి చెప్పగలవా పవన్ ? తీసుకున్న 21 లో కూడా 80% టీడీపీ వారికే టికెట్లు ఇచ్చావ్…2019 లో ఒక్క సీటుతో ఉన్న జనసేనని ఇప్పటివరకు మోసము. కానీ కష్టపడిన కార్యకర్తలని అన్యాయం చేసావ్ అంటూ పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ గా చర్చలకు దారి తీశాయి. 



Source link

Related posts

ఆ ఒక్క రోజే నాని విశ్వరూపం చూపిస్తాడు…

Oknews

Vishwak Sen Satire on Premalu Movie ప్రేమలు పై విశ్వక్ సెటైర్

Oknews

Telangana Education Department Has Finalized DSC Exam Dates, Check Exams Schedule, Syllabus Here | TS DSC: డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు

Oknews

Leave a Comment