Health Care

పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే గుండె పోటుకు సంకేతాలే!


దిశ, ఫీచర్స్: ప్రస్తుతం కాలంలో చాలా మంది గుండె నొప్పితో ఎక్కువగా బాధపడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్న వాళ్లు కూడా ఒక్కసారిగా గుండె నొప్పితో మరణిస్తున్నారు. అయితే.. కొంత వరకు గుండెకు సంబంధించిన వ్యాధులు శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగడం వల్లే వస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎలివేటెడ్‌ కొలెస్ట్రాల్‌, కాళ్ల వాపు గుండె జబ్బుకు ప్రాథమిక సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. గుండె స్ట్రోక్‌కు సంబంధించిన సంకేతాలు ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అయితే.. గుండె నొప్పి వచ్చేముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. వాటిలో ముఖ్యమైన దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముఖ్యంగా కాళ్ల వాపు గుండె జబ్బుకు ముఖ్య సంకేతమని నిపుణులు అంటున్నారు. శరీరంలో రక్త ప్రసరణ సరైన స్థాయిలో జరగనప్పుడు కాళ్లల్లో వాపులు వస్తాయట. ఈ రక్త ప్రసరణలో సమస్యల కారణంగా కూడా హాట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటోంది. బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగడం లేదని తెలుసుకోవడంలో ముఖ్యమైన అంశం కాళ్ల వాపులు. సాధారణంగా రక్త ప్రసరణ జరగని సమయంలో పాదాల్లో నీరు చేరుతుంది. అప్పుడు పాదం లావుగా వాస్తుంది. ఈ క్రమంలోనే కాళ్లలో వాపు గుండె జబ్బుకు ప్రాథమిక సంకేతమని చెబుతున్నారు నిపుణులు.

అందుకే ఎప్పుడూ లేకుండా సడెన్‌గా కాళ్లల్లో మార్పులు వచ్చిన అవి వాపునకు గురైనా లైట్ తీసుకోకుండా డాక్టర్లను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా వాపులతో పాటు.. పాదాలు, చీలమండలు, పొత్తికడుపు వాపు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాళ్లు, పాదాలలో వాపును పెరిఫెరల్ ఎడెమా అంటారు. దీంతో కాళ్లు బరువుగా ఉంటాయి. చర్మంలో కూడా వాపు లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఈ వాపు పాదాలు వేడిగా, గట్టిగా మారడానికి కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు.



Source link

Related posts

Smart Phone: స్మార్ట్ ఫోన్ యాడ్స్‌‌లో AI ఫీచర్స్ హైలెట్ చేస్తే తగ్గుతున్న సేల్స్.. షాక్ ఇస్తున్న కారణాలు

Oknews

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని మీ డైట్ లో చేర్చుకోవాలి

Oknews

Naga Panchami : నాగ పంచమి రోజు చేయకూడని పనులు ఏవో తెలుసా?

Oknews

Leave a Comment