దిశ, ఫీచర్స్ : ప్రజలు చేతి పై ఉన్న రేఖలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఇతర భౌతిక లక్షణాల నుండి కూడా భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి తెలుసుకోవచ్చంటున్నారు జ్యోతిష్కులు. పాదాల ఆకారాన్ని, వాటి రంగును, వాటి పై ఉన్న గుర్తులను చూసి వ్యక్తి స్వభావం, వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చంటున్నారు. మరి ఆ ప్రత్యేక గుర్తులు, పాదాల ఆకృతి గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
♦ అరికాళ్ళు గులాబీ రంగులో ఉంటే లేదా రక్తంలా ఎర్రగా ఉంటే వారు జీవితంలో అన్ని సౌఖ్యాలను కలిగి ఉంటారని, ఉన్నత స్థానాన్ని పొందుతారని జ్యోతిష్కులు చెబుతున్నారు.
♦ పాదాల పై కలశం, కమలం, ఫ్యాన్, శంఖం, గొడుగు, ధనుస్సు, రథం, బుడగ, సూర్యుడు, చంద్రుడు, జెండా, గద, చేప, బాణం మొదలైన చిహ్నాలు ఉంటే వారు చాలా అదృష్టవంతులట.
♦ పాదాల కాలి వేళ్లు సమానంగా, మృదువుగా, ఒకదానికొకటి దగ్గరగా ఉండి, గుండ్రంగా ఉంటే అలాంటి వారు ధనవంతులు అవుతారట.
♦ నడిచేటప్పుడు పాదాలు నేలకు బాగా తాకుతూ, ఎర్రటి కమలంలా ఉండే స్త్రీలు ఐశ్వర్యవంతురాలవుతారట. జీవితంలో దేనికీ లోటు ఉండదట. ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పెళ్లి తర్వాత రాజులా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడట.
♦ మడమ గుండ్రంగా, మృదువుగా, అందంగా ఉంటే, అటువంటి వ్యక్తి జీవితం ఐశ్వర్యం, ఆనందంతో నిండి ఉంటుంది. పెద్ద మడమలు ఉన్న పురుషులు, స్త్రీలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంటారని చెబుతున్నారు.
♦ బొటనవేలు చదునుగా, పగుళ్లుగా, వంకరగా, పొడిగా లేదా చాలా చిన్నగా ఉంటే అశుభం అంటున్నారు.
♦ కాళ్లు ముందు భాగంలో వెడల్పుగా, వెనుక సన్నగా ఉంటే వారి జీవితంలో తరచు దుఃఖాన్ని కలిగి ఉంటారట.
♦ పాదాల వెనుక అరికాలు రెండింటిలో చెమటలు పట్టడం మంచి సంకేతం కాదంటున్నారు.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.