EntertainmentLatest News

పాన్ ఇండియా హీరో తేజ సజ్జ మరో సంచలనం!


ఈ ఏడాది ‘హనుమాన్’తో సంచలన విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోగా అవతరించిన తేజ సజ్జ.. తాజాగా తన కొత్త సినిమా సినిమాని ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు.

సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ ని బట్టి చూస్తే ‘హనుమాన్’ తరహాలోనే ఇది కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ ఫిల్మ్ అనిపిస్తోంది. అలాగే ఏప్రిల్ 18న టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా ఈ సినిమాకి ‘మిరాయ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వినికిడి. ఏప్రిల్ 18న దీనిపై క్లారిటీ రానుంది.

ఇక ఈ చిత్రంలో తేజ సజ్జతో పాటు మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా మనోజ్ నెగటివ్ రోల్ లో సర్ ప్రైజ్ చేయనున్నాడని తెలుస్తోంది.



Source link

Related posts

anasuya enjoying the lock down time with home work and dancing together

Oknews

ప్రతాపరెడ్డి జన్మదిన వేడుకల్ని జరిపించిన చరణ్ వైఫ్ ఉపాసన.. ఆడపిల్లలు ఎదగాలి  

Oknews

రంభ కూతురుని చూసారా..తల్లిని మించిన అందం ఆమె సొంతం 

Oknews

Leave a Comment