Health Care

పాము మనిషి శరీరంలోని ఆ భాగంపైనే ఎందుకని ఎక్కువగా కాటు వేస్తుంది?


దిశ, ఫీచర్స్ : పాములంటే సహజంగానే అందరూ భయపడుతుంటారు. విష సర్పాలు కాబట్టి అవి కాటు వేస్తే చనిపోతామనే ఆందోళన ఉంటుంది. అయితే పాములకు సంబంధించిన పలు అపోహలు, నమ్మకాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకు పాము కాటు వేసినప్పుడు మంత్రం వేస్తే చనిపోకుండా ఉంటారని కొందరు నమ్ముతుంటారు. కానీ ఇది మూఢనమ్మకమని నిపుణులు చెప్తున్నారు. పాము కాటు వేయగానే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలని, డాక్టర్లు యాంటీ వీనమ్ ట్రీట్మెంట్ అందిస్తారని సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం ప్రపంచంలో 2700 పాము జాతులు ఉండగా వీటిలో 10 శాతం మాత్రమే విషపూరితమైనవి.

ఇకపోతే పాము కాటుకు సంబంధించిన చాలా కేసుల్లో సాధారణంగా వినిపించే విషయం ఏంటంటే.. అవి ఎక్కువగా మనిషి శరీరంలోని చేతులు, పాదాలు, చీలమండ వంటి భాగాలపైనే కాటు వేస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తుంటారు. నిపుణుల ప్రకారం పాములు నేలపై పాకే జీవులు, సహజంగా అవి పొదల్లో, రాళ్లల్లో, ఇరుకైన గోడల మధ్య సందుల్లో, పుట్టల్లో, పొలం గట్లలోని బొరియల్లో తిరుగాడుతుంటాయి. రాత్రిపూట చీకట్లో ఆహారం కోసం బయటకు వస్తుంటాయి.

పాములు కావాలని కాటు వేయవు కానీ మనుషులు అనుకోకుండా వాటిని తాకినప్పుడో, చూసుకోకుండా కాళ్లతో తొక్కడినప్పుడో, ఏదైనా వస్తువును వెతుకున్నప్పుడు చేయి తగిలితేనో భయంతో వెంటనే అలర్ట్ అవుతాయి. తమకు ఏదో ప్రమాదం పొంచి ఉందని గ్రహించి కాటు వేస్తాయి. అయితే మనుషులు వాటిని కాళ్లతో తొక్కడం, చేతులతో తాకడం వంటి సందర్భాలే అకస్మాత్తుగా ఎక్కువగా జరుగుతుంటాయి. పైగా అవి పాకే జీవులు కాబట్టి, మనుషులు వాటిని సమీపించగానే పైకి లేచినప్పటికీ వాటి తల మహా అయితే మనిషి మోకాళ్లు వరకే విస్తరిస్తుంది. కాబట్టి అవి ఎక్కువగా నడుము కింది భాగంలో.. అంటే కాళ్లు, పిక్కలు, చీలమండలం, కొన్ని సందర్భాల్లో చేతులపై మాత్రమే కాటు వేస్తుంటాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నారు. విష సర్పాలకు సంబంధించిన ఎటువంటి అనుమానాలు ఉన్నా నిపుణులను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవద్దు.



Source link

Related posts

టీ ప్రియులకు హెచ్చరిక.. ఈసారి మాత్రం మానుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం: FSSAI

Oknews

ఈ లక్షణాలు ఉన్న వారు జాగ్రత్త.. ఆ వ్యాధితో పోరాడుతున్నట్లే!

Oknews

బాల రాముని మూడో విగ్రహం లుక్ రివీల్.. దీనిని ఎక్కడ ఉంచుతారంటే.

Oknews

Leave a Comment