ఒక సూపర్ సూపర్ హిట్ సాంగ్ ఉంది. అందులో హీరో హీరోయిన్లు వేసే డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇంకే ముంది వరుస పెట్టి వీడియోలు చేస్తు సోషల్ మీడియాని షేక్ చేస్తారు. మరి ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో ఒక హీరోయిన్ చేరితే. ఆ కిక్కే వేరు కదా. ఆ కిక్ ఇస్తుంది ఎవరో కాదు ఆషికా రంగనాథ్( Ashika ranganath)
ఆషికా రంగనాథ్.. మండు వేసవిని సైతం మంచు బిందువులుగా మార్చగలిగే అందం ఆమె సొంతం. 2016 లో క్రేజీ బాయ్ అనే కన్నడ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత అక్కడే సుమారు ఒక పది సినిమాలు దాకా చేసింది.లాస్ట్ ఇయర్ కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. మొన్న సంక్రాంతికి నాగార్జున తో నా సామి రంగ చేసి బోలెడంత మంది అభిమానులని సంపాదించింది. ఇక ఈమె లేటెస్ట్ గా అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 లో ని సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడు నా సామి అనే పాటకి స్టెప్ లు వేసింది. ఒరిజినల్ లో రష్మిక ,అల్లు అర్జున్ ఎలా అయితే వేసారో సేమ్ అలాగే వేసింది. అంతే కాకుండా పాటకి తగ్గట్టు ముస్తాబయ్యి చాలా క్యూట్ గా ఉంది. తన ఇనిస్టాగ్రమ్ లో ఉన్న ఈ వీడియోకి ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. లైక్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. నీ సామి ఎవరు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అదే విధంగా నేను పార్టీకి ఆలస్యంగా వచ్చాను. కానీ నా డాన్స్ చూడటానికి మీరు ఇష్టపడతారు అని మెసేజ్ చేసింది.
ఆషికా ఇప్పుడు చిరంజీవి(chiranjeevi)మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ విశ్వంభర(vishwambhara)లో చేస్తుంది. ఇది ఆమె కెరీర్ కి మంచి అవకాశం. పైగా తనది కథకి చాలా కీలకమైన క్యారక్టర్ అని తెలుస్తుంది. దీంతో రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం ఉంది.ఇక సూసేకి సాంగ్ ని శ్రేయా ఘోషల్ పాడగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఏజ్ తో సంబంధం లేకుండా పలువురు సెలబ్రిటీలు కూడా స్టెప్పులు వేస్తూ వీడియోలు చేస్తున్నారు.