తగిన నిర్ణయం తీసుకుంటాం- కాంగ్రెస్వర్సింగ్ప్రెసిడెంట్పాలకుర్తి(Palakurthi Congress) నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం గాంధీ భవన్(Nampally Gandhi Bhavan) ఎదుట ఆందోళన చేపట్టడంతో పార్టీ వర్కింగ్‌ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, పాలకుర్తి ఎమ్మెల్యేకు మధ్య సఖ్యత లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. మండల అధ్యక్షులను తొలగించే బాధ్యత జిల్లా అధ్యక్షులకు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఝాన్సీరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నట్టుగా తమ దృష్టికి రాలేదన్నారు. ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య సఖ్యత ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, పాలకుర్తి విషయంలో అన్ని వివరాలు పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకుంటామని మహేశ్ కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన కార్యకర్తలు శాంతించి, అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.
Source link