Health Care

పాలలో, జాజికాయ పొడిని కలుపుని తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..?


దిశ, ఫీచర్స్: రోజూ రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అదే పాలలో అర టీస్పూన్ జాజికాయ పొడిని కలుపుకుని తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో పాలలో జాజికాయ పొడిని కలుపుకుని రోజూ తీసుకోవడం వల్ల అన్ని రకాల జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇవే కాకుండా, శరీరానికి ఇతర లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

నిద్రలేమి సమస్య

మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో రాత్రులు బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే రోజూ పాలలో చిటికెడు జాజికాయ పొడిని కలుపుకుని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలను పొందవచ్చు. అంతే కాకుండా దీనిలో ఉండే గుణాలు ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి.

జీర్ణక్రియ సమస్య

జాజికాయ పొడిని పాలలో కలిపి తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే మనం తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయగలదు.

చర్మ సమస్యలకు చెక్ పెట్టండి

జాజికాయ పొడి, పాలు కలిపినా మిశ్రమాన్ని తీసుకుని.. ప్రతిరోజూ మీ ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు తొలగిపోతాయి. అదనంగా, ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.



Source link

Related posts

బాడీ మసాజ్ కోసం.. ఆ నూనెలు వాడితే ఆరోగ్య సమస్యలన్నీ పరార్

Oknews

సింహరాశిలో పౌర్ణమి.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!

Oknews

క్లోజ్ ఫ్రెండ్‌ సర్కిల్‌తో హెల్త్ బెనిఫిట్స్.. స్ట్రోక్, హార్ట్ ఎ‌టాక్ రిస్క్ తగ్గుతుందంటున్న నిపుణులు

Oknews

Leave a Comment