పెన్షన్ల పంపిణీపై సీఎస్ కు చంద్రబాబు లేఖ
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి(Pension Distribution) అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Letter)లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లతో(Volunteers) పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా రేపు పెన్షన్ లు అందేలా చూడాలని టీడీపీ అధినేత లేఖలో కోరారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను కోరారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్న కారణంగా లబ్ధిదారులకు నగదు అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వృద్ధులు, వింతంతువులు, ఇతర లబ్దిదారులకు నగదు రూపంలో పెన్షన్ మొత్తం చెల్లించాలన్నారు. గ్రామ సచివాలయం ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో, ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ పంపిణీ జరిపేలా చూడాలన్నారు. దీని కోసం సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని(Pension Amount) బ్యాంకుల నుంచి తీసుకుని వెళ్లాడానికి అనుమతించాలి…దీనికి అసవరం అయిన అనుమతులు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పెన్షన్ ల పంపిణీకి తగు చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను(CEO) కోరారు చంద్రబాబు నాయుడు.