Entertainment

పిండం విడుదల చేసిన హీరో 


 

కొన్ని కొన్ని సినిమాలు  ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ప్రకటించినప్పుడే ప్రేక్షకుల్లో ఆ సినిమా చూడాలనే కుతుహలాన్ని కలిగిస్తాయి. అందులోను హర్రర్ సినిమాలు అయితే ఇంక చెప్పక్కర్లేదు విపరీతమైన కుతూహలాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు అలాంటి కుతూహలాన్నే ఒక సినిమా కలిగిస్తుంది. ప్రముఖ హీరో చేతుల మీదుగా ఆ సినిమా టైటిల్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి సినిమా మీద అంచనాలని పెంచాయి.


శ్రీకాంత్ శ్రీరామ్ ,ఖుషి రవి  జంటగా శ్రీకాంత్ దైద దర్శకత్వం లో తెరకెక్కతున్న  మూవీ కి  పిండం అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. అలాగే ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. ప్రముఖ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. అలాగే   సిఎంమా విజయవంతమవ్వాలని చిత్ర యూనిట్ ని అభినందించారు. శ్రీ విష్ణు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఒక పసి పాప బల్ల మీద పడుకుంటే పక్కనే శ్రీరామ్ అండ్ ఖుషి రవి,ఈశ్వరి రావు మరియు కొంత మంది  బల్ల పైన పడుకున్న పాప వైపు కాకుండా పైకి చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు భయం తో చూస్తూ ఉండటంతో ఏమయ్యుంటుందునే క్యూరియాసిటీ ని ఫస్ట్ లుక్ లోనే ప్రేక్షకులకి చిత్ర బృందం కలిగించినట్టు అయ్యింది.


కలాహి మీడియా పతాకం పై  యశ్వంత్ దగ్గుమాటి నిర్మిస్తున్న ఈ పిండం మూవీ ప్రస్తుత కాలానికి అలాగే 1930 మరియు 1990  మధ్య కాలం లో నడిచే కథ అని మేకర్స్ చెప్పారు .హర్రర్ నేపధ్యం లో జరిగే ఈ మూవీ  వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

 


 



Source link

Related posts

'మథగం 2' వెబ్ సిరీస్ రివ్యూ

Oknews

ఆ పార్టీలోనే చేరి అందరి పని చెబుతా.. నా జోలికి రావద్దు: శివాజీ!

Oknews

వామ్మో ఇవేం కలెక్షన్స్ హనుమాన్..300 కోట్లా

Oknews

Leave a Comment