సినిమా వాళ్ళు రాజకీయ నాయకులుగా మారడం ఎప్పటి నుంచో వస్తుంది. కానీ తమ సహా నటుల నుంచి బహిరంగ మద్దతు వాళ్ళకి ఉండదు. ఒక వేళ మద్దతు ఇచ్చినా పబ్లిక్ గా మాత్రం ప్రచారం చెయ్యరు. ఒక పార్టీ ముద్ర పడటం తమ కెరీర్ కి మంచిది కాదని భావిస్తారు. కానీ ఇప్పుడు ఒక హీరో మాత్రం నేను ప్రచారం చేస్తానని అంటున్నాడు.
కెరీర్ లో ఎన్నో మంచి చిత్రాల్లో నటించిన హీరో నవదీప్. చందమామ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తన ఖాతాలో ఉంది. తాజాగా లవ్ మౌళి అనే మూవీని చేస్తున్నాడు. ఆ మూవీ విజయవంతం కావాలని కోరుతు పిఠాపురం లోని శ్రీ పాద వల్లభుడి ని దర్శించుకున్నాడు. చిత్ర యూనిట్ కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతు పిఠాపురం లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి తన మద్దతు ఉంటుందని, ఆయన గెలుపు కోసం ప్రచారం చేస్తానని కూడా చెప్పాడు. నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని కూడా చెప్పాడు.
నవదీప్ ఎంతో దైర్యంగా పవన్ కి ప్రచారం చేస్తానని చెప్పడం సోషల్ మీడియాలో ఇప్పుడు టాక్ అఫ్ ది డే గా నిలిచింది. తొలి నుంచి కూడా ఆయన మెగా ఫ్యామిలీ కి చాలా సన్నిహితుడు ఈ విషయాన్ని ఇటీవలే స్వయంగా చిరంజీవి కూడా చెప్పాడు.ఇక లవ్ మౌళి ఈ నెల 19 న విడుదల కాబోతుంది. ఆ మూవీ నుండి వచ్చిన నవదీప్ లుక్ ఇటీవల పెద్ద సంచలనం సృష్టించింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆ చిత్రం తెరకెక్కింది. పంకూరి గిద్వాని హీరోయిన్ గా చేస్తుండగా అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.శ్రీకర స్టూడియోస్, నైరా క్రియేషన్స్, సి స్పేస్ సంస్థ లు నిర్మిస్తున్నాయి