Health Care

పిల్లలకు పాస్తా చేసి పెడుతున్నారా?.. అంతకు ముందు ఇది తెలుసుకోండి!


దిశ, ఫీచర్స్ : ఎక్కువ సమయం తీసుకోకుండా ఈజీగా చేయగల స్నాక్స్ అండ్ టిఫిన్లలో మ్యాగీ తర్వాత పాస్తా కూడా ఒకటి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కాబట్టి మదర్స్ కూడా అడిగిన వెంటనే చేసిపెడుతుంటారు. అయితే గోధమ పిండిలో గుడ్లు లేదా నీరు కలిపి బాగా మరగించడం ద్వారా ఇది తయారు చేస్తారు. పైగా వివిధ డిజైన్లలోనూ చేయడంవల్ల ఏడెనిమిదేళ్లలోపు పిల్లలైతే చూడగానే ఆకర్షితులవుతారు.

ప్రాసెస్ చేసిన గోధుమ లేదా మైదా పిండితో తయారు చేస్తారు కాబట్టి పాస్తాను పిల్లలకు రెగ్యులర్‌గా ఇవ్వడం ఆరోగ్యానికి మంచిది కాదని పోషకాహార నిపుణులు అంటున్నారు. పైగా ఇందులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి క్రమంగా లావెక్కడానికి కారణం అవుతాయి. కాబట్టి అధిక బరువు, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారైతే అసలు పాస్తాను తినకపోవడం ఇంకా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఒకవేళ దాని రుచి కారణంగా పాస్తాను తినకుండా ఉండలేం అనుకునేవారు సుమారు ఒక కప్పునకు మించకుండా తీసుకోవడంవల్ల పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక కప్పు పాస్తాలో 200 కేలరీలు, 40 గ్రాముల కార్బో హైడ్రేట్లు, 6 గ్రాముల ప్రోటీన్లు, 2 గ్రాముల వరకు ఫైబర్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు శరీరానికి అందే చాన్స్ ఉండదు కాబట్టి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడదు. అంతకు మించి తీసుకుంటే మాత్రం ఒబేసిటీ, ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

* గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. ఆహారాలు ఆరోగ్యంపై ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏవి తీసుకోవాలి?, ఏవి తీసుకోకూడదు? అనే సందేహాలకోసం పోషకాహార నిపుణులను సంప్రదించగలరు.



Source link

Related posts

నేరేడు పండ్లే కాదు.. గింజలు కూడా మంచిదే.. హెల్త్ బెనిఫిట్స్ ఇవిగో..

Oknews

భోజనంలో అప్పడాలు తినే వారికి వీటి గురించి తెలుసా

Oknews

అలసట, ఆందోళనను దూరం చేసే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్.. రోజూ చేయడంవల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే..

Oknews

Leave a Comment