Health Care

పిల్లల్లో తెలివితేటల్ని పెంచే అలవాట్లు.. పేరెంట్స్ ఏం చేయాలంటే..


దిశ, ఫీచర్స్ : ఆ పిల్లవాడిని చూశావా?.. ఎంత తెలివిగా ఉంటాడో.. వాడికున్న బుద్ధి నీకు లేదంటూ ఇతరులతో పోల్చుతూ తమ పిల్లల్ని మందలిస్తుంటారు కొందరు పేరెంట్స్. కానీ ఇలా చేయడం మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు. పైగా దీనివల్ల చిన్నారుల్లో మార్పు రాకపోగా నిజంగానే ప్రతికూల మనస్తత్వం ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే పిల్లల్లో తెలివితేటలు పెంచేందుకు రోజువారీ అలవాట్లు కూడా హెల్ప్ అవుతాయని అంటున్నారు. అవేంటో చూద్దాం.

* సామాజిక చర్యలు : కొందరు తమ పిల్లలు బయట తిరిగితే చెడిపోతారని, ఇతరులతో ముచ్చట్లు పెడితే చదువులో వెనుకబడుతారని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. వాస్తవానికి సోషల్ ఇంటరాక్షన్ పిల్లల్లో తెలివితేటలను పెంచుతుంది. అనేక విషయాలపట్ల అవగాహన ఏర్పడేందుకు, స్వతంత్రంగా ఆలోచించేందుకు సహాయపడుతుంది. కాబట్టి పేరెంట్స్ తమ పిల్లల్ని సామాజిక పరస్పర చర్యల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

* స్టడీ అండ్ అబ్జర్వేషన్ : పుస్తకాలు, న్యూస్ పేపర్లు వంటివి చదివే అలవాటు పిల్లల్లో పరిశీలనాత్మక దృష్టిని, సోషల్ నాలెడ్జ్‌‌ను ఇంప్రూవ్ చేస్తుంది. ఈ అలవాటువల్ల తెలివైన వారిగా మారుతారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇష్టమైన పుస్తకాలు చదివేలా మోటివేట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

* క్వాలిటీ స్లీప్ : వాస్తవానికి నాణ్యమైన అందరికీ ముఖ్యం. ఇది యాక్టివ్‌నెస్‌ను పెంచుతుంది. పిల్లల్ని తరచుగా హెచ్చరించడం, ఆందోళనకు గురిచేయడం వారిలో క్వాలిటీ స్లీప్‌కు ఆటంకంగా మారుతుంది. కొందరు చిన్నారులు చదువు, ఆటల్లో పడి సమయానికి నిద్రపోకుండా కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇదంతా పిల్లల తెలివితేటలు, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి పేరెంట్స్ తమ చిన్నారులకు సరైన నిద్ర ఉండేలా చూడాలి.

* విషయాల పట్ల ఆసక్తి: కొంగ్రొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా పిల్లల్లో నాలెడ్జ్ ఇంప్రూవ్‌మెంట్‌కు సహాయపడుతుంది. చదువులో కూడా కుతూహలం ప్రదర్శిస్తారు. ఈ అలవాట్లను ప్రోత్సహించడం వల్ల వారిలో తెలివి తేటలు పెరుగుతాయి.

* పోషకాహారం : తీసుకునే ఆహారాలు కూడా పిల్లల మెదడు సామర్థ్యాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే జంక్ ఫుడ్స్‌ ఆ సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అన్ని రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉండే తాజా కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు వంటివి ఇవ్వాలని, ఇవి పిల్లల్లో బ్రెయిన్ యాక్టివిటీస్‌ను పెంచడంలో సహాయపడతాయని చెప్తున్నారు.



Source link

Related posts

Happy Fathers Day : నాన్న.. ఈ టెస్ట్ చేయించుకో..

Oknews

HEALTHY FOODS ఈ ఆహారాలను వండిన మరుసటి రోజు తింటే ఆ రుచే వెరబ్బా.. పైగా!

Oknews

మూడు ప్రమాదకరమైన క్యాన్సర్లను ఈజీగా కనిపెట్టే అద్భుత టెక్నాలజీ.. (వీడియో)

Oknews

Leave a Comment