దిశ, ఫీచర్స్ : ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళినప్పుడు ఇల్లు వెతుక్కోవడమే పెద్ద పని. ఎందుకంటే ఉండేందుకు ఇల్లు దొరికినా అక్కడి యజమాని మీకు నచ్చకపోవచ్చు. ఒక వేళ యజమాని నచ్చినా ఇల్లు నచ్చకపోవచ్చు. అద్దె ఇళ్లలో ఇలాంటి అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇది ఇప్పుడు సర్వసాధారణంగా ఉన్న సమస్య. ఇక రెంట్ల విషయానికి వస్తే మన ఇండియాలో కన్నా విదేశాల్లో భిన్నంగా ఉంటాయి. అంతే కాదు అక్కడి మహిళలు తన పిల్లల దగ్గర నుంచి కూడా అద్దె వసూలు చేస్తుందట. తల్లిదండ్రులు మొదటి నుండి పిల్లలను స్వావలంబన చేసేలా ఇలాంటి ప్రక్రియలు చేస్తారట. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం,
అందుకే పిల్లల దగ్గర అద్దె తీసుకుంటుందా ?
ది న్యూయార్క్ పోస్ట్ అనే ఆంగ్ల వెబ్‌సైట్ కథనం ప్రకారం సమంతా బర్డ్ అనే మహిళ సోషల్ మీడియాలో ఒక విషయాన్ని షేర్ చేసింది. ఇందులో తన ఇంట్లోని చిన్న పిల్లల నుంచి అద్దె తీసుకుంటానని చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ చిన్నారుల వయసు 6, 8, 9 ఏళ్లు మాత్రమే. ప్రతి నెలా తన పిల్లలు $6 అద్దె చెల్లిస్తున్నట్లు ఆ మహిళ తన పోస్ట్‌లో తెలిపింది. ఇందులో వారు ఇంటి అద్దెకు 1 డాలర్, కిరాణా కోసం 1 డాలర్, యుటిలిటీకి 1 డాలర్ చెల్లించాలి. మిగతా మూడు డాలర్లు వారి ఖాతాలో వేస్తారట.
ఇలా చేయడం ద్వారా పిల్లలు చిన్నతనం నుంచే డబ్బు విలువను బాగా అర్థం చేసుకుంటారని, వారు తమ డబ్బును తెలివిగా ఖర్చు చేస్తారని అన్నారు. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో రావడంతో తెగ వైరల్ అయ్యింది. ఇది చూసిన జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ తమ రియాక్షన్స్ ను పంచుకుంటున్నారు. ఒక వినియోగదారు ఇలా కామెంట్ చేశారు, ‘ఈ పద్ధతి చాలా తప్పు, ఇది పిల్లల పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సులోనే డబ్బు చూస్తారు.’ మరొకరు, ‘పద్ధతి చాలా బాగుంది ఎందుకంటే దీని ద్వారా పిల్లలు డబ్బు నిర్వహణ పద్ధతిని నేర్చుకుంటారు’ అని రాశారు. అలాగే చాలా మంది వ్యూవర్స్ కూడా వారి కామెంట్లను తెలిపారు.