Health Care

పిల్లల పుడితే భార్యాభర్తలు విడాకులు తీసుకోకుండా ఉంటారా?


దిశ, ఫీచర్స్ : ఒకే ఆఫీసులో పని చేస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఒక ఏడాది హాయిగా వివాహ బంధాన్ని ఎంజాయ్ చేశారు. కానీ ఆ తర్వాత డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. విషయం పెద్దల వరకు వెళ్లింది. అందరూ కలిసి సర్దిచెప్పే ప్రయత్నమూ జరిగింది. అయినా సరే ఎడ మొహం పెడ మొహం పెట్టడంతో.. ఈ ప్రాబ్లమ్‌కు ఒకటే సొల్యూషన్ అని తీర్మానించారు. మీరు ఇద్దరే ఎక్కువ సేపు గడపడం వల్ల గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఒక పిల్లనో, పిల్లాడినో కనాలని సలహా ఇచ్చారు. దాదాపు అన్ని ఇండియన్ ఫ్యామిలీస్ కూడా ఇలాంటి సూచనలే ఇవ్వడం గమనించవచ్చు. కానీ ఇదెంత వరకు కరెక్ట్. పిల్లలు పుడితే నిజంగానే పెళ్లిళ్లు నిలబడుతున్నాయా? లేక కన్న పిల్లల జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయా? అసలు ఈ సలహాతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? చూద్దాం.

ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏళ్లకు ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయంటే ముందుగా సైకియాట్రిస్టును కలవడం మంచిది. కొన్ని సెషన్స్ అటెండ్ అయ్యాక ఎక్కడ ఏ తప్పు జరుగుతుందో తెలుసుకుని వివరిస్తారు. వారు చెప్పిన సజెషన్స్ ఫాలో అవుతూ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసుకోవచ్చు. అంతేకానీ తల్లిదండ్రుల మాట విని పిల్లలను కన్నట్లయితే.. వారి జీవితాలనే ఫణంగా పెట్టినట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. భాగస్వాములిద్దరూ తమ బంధంలో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించినా పరిస్థితులు మెరుగుపడకపోతే విడిపోవడం మంచిది. కానీ పిల్లల పెంపకం అనే మరో ఒత్తిడిని తలపై పెట్టుకోవడం సరికాదని సూచిస్తున్నారు. దీనివల్ల సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందంటున్నారు.

వివాహాన్ని కాపాడుకోవాలనే తపనతో సంతానాన్ని ఈ లోకంలోకి తీసుకురావడం చక్కని పరిష్కారమనే భావన దంపతులకు రావడం శోచనీయం. ఈ ప్రయాణంలో మహిళలు పురుషులను ద్వేషించే స్థాయికి ఎదుగుతారు. మానసికంగా చాలా గాయపడుతారు.దీంతో తప్పక విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వీరికి పుట్టిన పిల్లలు ఇతర పిల్లల మాదిరిగా కాకుండా.. తల్లిదండ్రుల తగాదాల మధ్య నలిగిపోతారు. వారు పెద్దగా అయ్యేసరికి బంధాలంటేనే విసుగొస్తుంది. ప్రేమ, పెళ్లి అంటే ద్వేషం పెరుగుతుంది. మెంటల్‌గా చాలా ఎఫెక్ట్ అవుతారు.

మరో ముఖ్యమైన అంశం ఇంట్లో వాతావరణం. మన ఇల్లు మన సురక్షితమైన ప్రదేశం. ప్రతిరోజూ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడే మనల్ని మనం పునరుత్తేజం చేసుకుంటాం. మీరు వివాహం చేసుకున్నట్లయితే.. మీ భాగస్వామితో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించుకోవాలని గుర్తుంచుకోవాలి. కలిసి బిడ్డను కనడం మినహా మరేదైనా సొల్యూషన్‌ను ఎంచుకోండి. మీ పిల్లలు

జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులు.. దంపతులిద్దరూ హ్యాపీగా ఉండని ఇంట్లో పెంచేందుకు మీకు అర్హత లేదు.



Source link

Related posts

ఈ పండ్ల తొక్కలతో పాదాలకు మెరుపు..

Oknews

పదే పదే ఫోన్ చూసే వారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి

Oknews

ఈ వ్యాధితో బాధపడుతున్నవారు బనానా చిప్స్‌ను తీసుకోకూడదు?

Oknews

Leave a Comment