ByGanesh
Mon 11th Mar 2024 04:56 PM
రీసెంట్ గా ప్రముఖ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ని ఓ రేంజ్ లో నిర్వహించారు. భారీగా డబ్బు ఖర్చు, బాలీవుడ్ సెలబ్రిటీస్ డాన్సులు, సీత కొక చిలుకల్లా అలంకరించుకుని అంబానీ ఇంట వేడుకల కోసం కదిలిన ప్రముఖులతో గుజరాత్ మెరిసిపోయింది. ఆ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ గురించి, అందులో వేసుకున్న డ్రెస్సులు గురించి, వడ్డించిన వంటకాల గురించి ఇంకా ఇంకా జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
ఇప్పుడొక బాలీవుడ్ స్టార్ హీరో భార్య, మాజీ హీరోయిన్ పిల్లల పెళ్లిళ్లపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తమ పిల్లలు పెళ్లిళ్లు చేసుకోవడం కంటే లేచి పోవడం బెటర్ అంటూ అక్షయ్ కుమార్ వైఫ్ ట్వింకిల్ ఖన్నా ఫన్నీగా చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి. అంబానీ ఇంట పెళ్లి సెలెబ్రేషన్స్ తర్వాత పెళ్ళిళ్ళకి సంబందించిన సెలెబ్రేషన్స్ ప్రమాణాలు పెరిగిపోయాయి. నేను నీతా అంబానీల డాన్స్ చెయ్యలేను, కొద్దిరోజుల క్రితం ఏదో డాన్స్ చేస్తూ కాలు విరగ్గొట్టుకున్నాను.
ఇక నా భర్త(అక్షయ్ ఉమర్) రాత్రి పది తర్వాత మెలుకువగా ఉండలేరు. నేను హ్యాపీగా ఉండాలని పిల్లలు అనుకుంటే గనక వారు లేచిపోయి పెళ్లి చేసుకుంటే బెటర్ అంటూ ట్వింకిల్ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఫన్నీ ఫన్నీగా చక్కర్లు కొడుతున్నాయి.
Akshay Kumar wife funny comments on children marriage:
Twinkle Khanna funny comments on children marriage