Entertainment

పీరియాడికల్ లవ్ స్టోరీ ‘ఎల్లమ్మ’తో బలగం వేణు.. హీరోగా నాని..!


జబర్దస్త్ కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారి తెలంగాణ నేపథ్యంలో ఒక మూవీ తీసి హిట్ కొట్టాడు వేణు వండర్స్ అదేనండి “బలగం” వేణు. తెలంగాణ యాసలో కుటుంబ కథతో తీసిన బలగం మూవీ ఇప్పుడు వేణు ఇంటి పేరుగా మారిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ లో డైరెక్టర్ గా పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు వేణు యెల్దండి. మరి నెక్స్ట్ ఆయన ఏ మూవీతో రాబోతున్నారు అనే విషయం పై  చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇకపోతే ఇప్పుడు వేణు తన జానర్ ని కొంచెం డిఫరెంట్ గా మార్చేశాడు. అదే లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందు రాబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా పీరియాడికల్ లవ్ స్టోరీ..అందుకే ఈ కథను వేణు ఎంచుకున్నాడనే విషయం తెలుస్తోంది. ఇక ఈ మూవీ నేచురల్ స్టార్ నానితో ప్లాన్ చేస్తున్నాడు. “ఎల్లమ్మ” అనే టైటిల్ తో తెరకెక్కబోయే ఈ మూవీలో నాని లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. నాని ఎంచుకునే అంశాలన్నీ నేచురల్గా ఆడియన్స్ మైండ్ సెట్ కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ మూవీస్ హిట్ కొడుతున్నాయి. అలాగే నాని కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన హాయ్ నాన్న సూపర్ హిట్ అయ్యింది. ఇక “సరిపోదా శనివారం” అనే థ్రిల్లర్ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మే వరకు ఉండబోతోంది. జూన్ నుంచి కానీ జులై నుంచి కానీ వేణు తెరకెక్కించే లవ్ స్టోరీలో నటించబోతున్నాడు నాని. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టేసారు వేణు అండ్ టీమ్. బలగం మూవీ నిర్మించిన దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ “ఎల్లమ్మ” మూవీ కూడా తెరకెక్కబోతోంది. త్వరలోనే ఈ మూవీని  అనౌన్స్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. నాని ఫాన్స్ కి ఈ మూవీ కూడా కచ్చితంగా నచ్చుతుంది అనే టాక్ వినిపిస్తోంది.



Source link

Related posts

‘NBK 109’ సెట్ లో ప్రమాదం.. తీవ్ర గాయాలు!

Oknews

సుహాస్ 'జనక అయితే గనక' టీజర్ రిలీజ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్!

Oknews

‘దేవర’ డేట్ కి వస్తున్న రవితేజ..!

Oknews

Leave a Comment