దిశ, సినిమా: వేసవి దగ్గరకు వచ్చింది.. ఈ సీజన్‌లో ఎక్కువ డిమాండ్ ఉండేది పుచ్చకాయలకు.. ఎక్కడ చూసిన మనకు అవే పండ్లు కనిపిస్తాయి. ఎందుకంటే వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ. ఎండ కారణంగా మన శరీరంలో వాటర్ లెవెల్స్ మాటిమాటికీ తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్ స్టేజ్‌కి వెళ్లిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోతాం.. చెప్పలంటే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే బాడీలో వాటర్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు డాక్టర్లు. కానీ ఈ పండులో చాలా రకాల రసాయనాలు కలుపుతున్నారు. మరి నకిలీ పుచ్చకాయ గుర్తించడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
1. మార్కెట్‌లో ఎర్రగా నిగనిగలాడే అన్ని పుచ్చకాయలు మంచివే అనుకొకండి. ఎందుకంటే అవి అంత ఎర్రగా.. తీయగా పండేందుకు వాటిలో కార్బైడ్‌ను కలుపుతారు. ఇది ఇథనాల్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. దీని ఫలితంగా పండ్లు త్వరగా పండుతాయి. అలాగే త్వరగా పక్వానికి రావడానికి, రంగు కోసం సుడాన్ రెడ్, మిథనాల్ ఎల్లో, మెర్క్యూరీ క్రోమెట్ వంటి రసాయనాలు కూడా ఉపయోగిస్తున్నారు అనీ ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పండ్లు ఆరోగ్యానికి చాలా హానికరం.
2. పండిన పుచ్చకాయ గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. అదే సహజంగా పండిన పుచ్చకాయ పండ్ల గింజలు నల్లగా ఉంటాయి.. పెద్దగా ఉంటాయి. ఇలా మనం నకిలి పండుగా గుర్తించవచ్చు. కట్ చేసిన పండు గుజ్జు రంగులో తేడా ఉంటుంది.. కోసినప్పుడు విడిపోతే ఆ పుచ్చకాయలో కెమికల్ కంటెంట్ ఉందని చెప్పవచ్చు. ముక్కలుగా కట్ చేసినప్పుడు గుజ్జుగా కింద పడుతూ ఉంటే అది సరైనది కాదని అర్థం.
3. కొనేముందు ఓపికగా పుచ్చకాయని పరిశీలిస్తే అందులో కెమికల్ కలిపారో లేదో కట్ చేయకపొయిన తెలుసుకొవచ్చు. ఎలా అంటే పుచ్చకాయలో సూదితో పొడిచిన చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రం లోంచి కెమికల్‌ని పండులోకి పంపుతారు. ఒక వేల మనం దాని గమనించి అమ్మేవారిని అడిగిన ఈ విషయం ఒప్పుకోరు. అందుకే కోనే ముందు పుచ్చకాయని చూట్టురా మొత్తం గమనించి తీసుకొండి.
4. పుచ్చకాయ పండ్లు ఆకు పచ్చ.. అలాగే ఆకు పచ్చ చారలతో కనిపిస్తాయి. కొన్నింటి పై తెల్లటి పెద్ద పెద్ద మచ్చలు కనిపిస్తాయి. ఇలా తెల్లటి మచ్చలు ఉన్న పండ్ల పై రసాయనాలు స్ప్రే చేసినట్లు అర్థం. వాటిని చేతులతో తాకగానే మనకి పౌడర్ లాంటిది అంటుకుంటుంది. అలాంటి పండ్ల కొనకండి. ఆరోగ్యానికి మంచిది కాదు.
5. ఇక ఇలా కార్బైడ్‌తో చేసిన పండ్లను తినడం వల్ల కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. మిథనాల్ కాలేయం,అలాగే క్రోమేట్ కడుపు సమస్యలు, రక్తహీనత, మెదడు దెబ్బతినడం, సంతానోత్పత్తి తగ్గడం వంటి సమస్యలను కలిగిస్తుంది.
మనం ఆరోగ్యంగా ఉండటం కోసం పండ్లను తింటాం. కానీ మనం తినే పండ్లు ఇలా శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. వ్యాపారం చేసుకునే వారు లాభం కోసం పండ్ల పై రసాయనాలు వాడుతున్నారు. అందుకే రసాయన రహిత పండ్లు తినడం మాత్రమే ఆరోగ్యానికి మంచిది. కావున కష్టం అనుకోకుండా పుచ్చకాయ కొనేటప్పుడు పైన చెప్పిన విషయాలు గుర్తించి పుచ్చకాయ కొనండి.