Top Stories

పుట్టడమే గుండె జబ్బుతో పుట్టాను – రేణుదేశాయ్


తను గుండె జబ్బుతో బాధపడుతున్నాననే విషయాన్ని ఈ ఏడాది ప్రారంభంలోనే బయటపెట్టారు రేణు దేశాయ్. తనకు పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లమ్ ఉందనే విషయాన్ని ఆమె గతంలో సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇప్పుడా సమస్యపై మరింత విపులంగా స్పందించారు.

"పుట్టుకతోనే నాకు గుండె జబ్బు ఉంది. ఆ విషయం నాకు తెలియదు. ఒంట్లో బాగాలేదని చిన్న చిన్న టెస్టులు చేశాం, అర్థం కాలేదు. ఫైనల్ గా సీటీ స్కాన్ చేసిన తర్వాత అప్పుడు బయటపడింది. ఇప్పుడేం చేయలేను. మా నాన్నమ్మకు కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది. ఆమె 47 ఏళ్లకే హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. మా నాన్న కూడా హార్ట్ ఎటాక్ తో యంగ్ ఏజ్ లోనే చనిపోయారు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతాను. మంచి ఆహారం తింటాను, యోగా-ప్రాణాయామం చేస్తాను. తిండి విషయంలో చాలా కంట్రోల్. నాకు అస్సలు కొలస్ట్రాల్ లేదు. బైపాస్ సర్జరీ అవసరం లేదు. ఎటొచ్చి పుట్టుకతోనే గుండెలో సమస్య ఉంది. జాగ్రత్తగా ఉంటున్నాను."

ఇలా తను గుండె జబ్బుతో బాధపడుతున్నాననే షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు రేణు దేశాయ్. ఈ విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డానని, పిల్లల భవిష్యత్తు తలుచుకొని టెన్షన్ పడ్డానని చెప్పిన రేణుదేశాయ్.. ప్రస్తుతం మందులు వాడుతున్నానని, అందుకే బరువు పెరిగానని అన్నారు.

"ఈ సమస్య వల్లనే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. హార్ట్ బీట్ ఎక్కువ నాకు. అది తగ్గించడం కోసం మెడిసిన్ వాడుతున్నాను. అందుకే బరువు పెరిగాను. ఇంకా చెప్పాలంటే లావెక్కాను. ఇలా చెప్పడానికి నేనేం ఫీల్ అవ్వడం లేదు. బద్ధకంతో నాకు ఒళ్లు రాలేదు, నా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల, మందులు వాడడంతో ఒళ్లు వచ్చింది. నేనేం చేయలేను కదా."

ఇకపై తన జీవితం ఇలా హార్ట్ ప్రాబ్లెమ్ తోనే కొనసాగుతుందని బాధగా చెప్పారు రేణు దేశాయ్. ప్రతి రోజూ మందులు తీసుకోవాలని, మెట్లు ఎక్కువగా ఎక్కడం, పరుగెత్తడం లాంటివి చేయకూడదని.. మరీ ముఖ్యంగా టెన్షన్ తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు.



Source link

Related posts

జ‌న‌సేన‌లో జోష్‌

Oknews

లేఖలతో ఊరుకుంటే అది జగన్ ఫెయిల్యూర్!

Oknews

బాబు మీద సుతిమెత్తగా విమర్శలు చేసిన చిన్నమ్మ

Oknews

Leave a Comment