Health Care

పురాతన చిత్రలిపి నుండి ఉద్భవించిన కెమెటిక్ యోగా.. ఆ పేరెలా వచ్చింది..


దిశ, వెబ్ డెస్క్ : అరబ్ దేశాల్లో యోగా పై ఉన్న అభిప్రాయం మారుతోంది. గత సంవత్సరం, సౌదీ అరేబియా విశ్వవిద్యాలయాలలో యోగా కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. అరబ్ దేశాల్లో ఉన్న ఈజిప్టుకు ప్రత్యేక రకమైన యోగా చరిత్ర ఉంది. దీనిని కెమెటిక్, ఈజిప్షియన్ యోగా అని పిలుస్తారు. ఈ యోగా మనిషి శక్తిని, అతని తెలివితేటల పై దృష్టి సారించేలా చేస్తుందని చెబుతున్నారు. ఈ యోగా పద్ధతి పురాతన ఈజిప్టులోని చిత్రలిపి నుండి ప్రేరణ పొందిందని అనేక పత్రాలలో కూడా పేర్కొన్నారు.

దీని ఆధునిక రూపం 1970లలో ఈజిప్టులో అభివృద్ధి చేశారు. దీనిని 1970లలో తమ పరిశోధన తర్వాత డాక్టర్ అసర్ హాపి, అల్విడ్ లారెన్స్ అభివృద్ధి చేశారు. ఈ యోగా ప్రక్రియను అక్కడి పూర్వీకులు అనుసరించారని పరిశోధకులు భావిస్తున్నారు. దీని మూలం ఈజిప్టుతో ముడిపడి ఉన్నప్పటికీ, ఆఫ్రికాలో ఈ యోగాను ఎక్కువగా చేస్తుంటారు. అందుకే దీనిని ఆఫ్రికన్ యోగా అని కూడా పిలుస్తారు. అలాగే దీనిని స్మై తావి అని కూడా పిలుస్తారు.

కెమెటిక్ యోగా అంటే ఏమిటి ?

భంగిమలు, ప్రాణాయామం, శ్వాస మధ్య సామరస్యాన్ని సృష్టిస్తూ కెమెటిక్ యోగాను చేస్తారు. శరీరమంతా శక్తిని ప్రసరించడానికి, శరీరాన్ని ఆధ్యాత్మికతతో అనుసంధానించడానికి ఇలా చేసే సంప్రదాయం ఉంది. కెమెటిక్ యోగా చాలా నెమ్మదిగా చేస్తారు. దీనిలో ప్రధాన దృష్టి ధ్యానం పై ఉంటుంది. ధ్యానం చేస్తున్నప్పుడు, శరీరంలోని శక్తి చక్రాలు మేల్కొంటాయి. ఈ యోగా అనేక భంగిమలు భారతీయ యోగాను పోలి ఉంటాయి.

ఈ పేరు ఎక్కడ నుండి వచ్చింది ?

యోగా ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం కెమెట్ అనే పదం ఈజిప్ట్ పురాతన పేరు. ఇంతకు ముందు ఇక్కడి ప్రజలు నల్లని రంగుతో ఉండేవారని పరిశోధనలు చెబుతున్నాయి. వారు సూడాన్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. ఈ వ్యక్తులు పిరమిడ్‌లను రూపొందించారు. అలాగే గణితం, ఆర్కిటెక్చర్, కెమిస్ట్రీ, మెడిసిన్, అనేక ఇతర రంగాలకు గణనీయమైన కృషి చేశారు. వారి ఆలోచనలను పవిత్ర చిహ్నాల రూపంలో వ్యక్తం చేశారు.

ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు, శరీరానికి, మనస్సుకు నేరుగా ప్రయోజనం కలిగించే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వెన్నెముకను సమతుల్యంగా ఉంచుతుంది. శరీర భంగిమను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేయడంతో పాటు శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతుంది. ఏకాగ్రతను తీసుకురావడంతో పాటు, శరీరంలో శక్తి స్థాయిని పెంచడానికి ఇది పనిచేస్తుంది. శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడంతో పాటు ఆధ్యాత్మిక శాంతిని కూడా అందిస్తుంది.

ఏ భంగిమలు?

కెమెటిక్ యోగాలో అనేక భంగిమలు కూడా ఉన్నాయి. మమ్మీ పోజ్ లాగా. భారతీయ యోగా నుంచి అర్థం చేసుకుంటే, ఇది శవసానాన్ని పోలి ఉంటుంది. నెఫెర్టెమ్ భంగిమ పురాతన ఈజిప్షియన్ దేవుడు నెఫెర్టెమ్‌కు ప్రత్యేక గౌరవాన్ని అందిస్తుంది. పురాతన ఈజిప్షియన్ చిత్రలిపిలో తలపై తామర పువ్వుతో వారి చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ యోగా భంగిమ లోటస్ పోజ్ లేదా పద్మాసనం, భారతీయ యోగా భంగిమను పోలి ఉంటుంది. అయితే ఇది పునర్జన్మ ప్రక్రియను, ఈ శక్తివంతమైన ఈజిప్షియన్ దేవతతో ఆధ్యాత్మిక సంబంధాన్ని మరింత పెంచుతుంది.



Source link

Related posts

అండాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు- కారణాలు- నివారణ..!!

Oknews

పాజిటివ్ ఎనర్జీకి కావాలా?.. వీటిపై ఫోకస్ చేయండి !

Oknews

మామిడి ప్రియులకి షాకింగ్ న్యూస్!.. మార్కేట్‌లో సందడి చేస్తున్న నకిలీ మ్యాంగోస్

Oknews

Leave a Comment