Health Care

పురాతన తవ్వకాల్లో బయటపడ్డ వింత వస్తువు..చివరికి


దిశ, ఫీచర్స్ : పురాతన కట్టడాలు, వస్తువులు, తవ్వకాల్లో బయటపడిన రహస్యాలు కొన్నిసార్లు చాలా వింతగొల్పుతుంటాయి. ఇదెలా సాధ్యం అయిందబ్బా! అనిపించేలా చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ సంఘటకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని రోజుల కిందట యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్)లో పురావస్తు తవ్వకాల సందర్భంగా ఓ అరుదైన మిస్టరీ కళాఖండం బయటపడింది. అయితే ఈ అంతుచిక్కని వింత వస్తువు 33 డోడెకాహెడ్రాన్లలో ఒకటని నిపుణులు చెప్తున్నారు.

వాస్తవానికి రేఖా గణితం (Geometry)లో 12 ఉపరితలాలు ఉన్న వస్తువులను డోడెకాహెడ్రాన్లు అంటారు. 2023లో ఇంగ్లాండ్, లింకన్ సమీపంలోని నార్టన్ డిస్నీలో తవ్వకాల్లో ఈ రహస్య వస్తువు బయటపడింది. యూకేలోని మిడ్‌లాండ్స్ లో కూడా రోమన్ డోడెకాహెడ్రాన్ కనిపించింది. అయితే ఇక్కడ కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్ అట. కాగా తవ్వకాల్లో దొరికిన ఈ వస్తువు కేవలం మూడు అంగుళాల పొడవు, 245 గ్రాముల బరువు కలిగి ఉండగా, సుమారు 1,700 సంవత్సరాల కిందటిది కావచ్చునని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే ఈ వస్తువుకు రోమన్ ఆచారాలు లేదా రిలీజియన్‌తో సంబంధం కలిగి ఉండవచ్చని నమ్ముతారు. కానీ ఏ రోమన్ గ్రంథంలోనూ అలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఈ వింత వస్తువు ఏ ప్రయోజనాలకోసం ఉపయోగించారన్న మిస్టరీ ఇంకా వీడలేదు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.



Source link

Related posts

ఆ పని చేసే ముందు అరటి పండు తినండి…

Oknews

ఒత్తిడికి కారణాలేంటో తెలుసా .. ఎలా తగ్గించుకోవాలి…?

Oknews

మైక్రో చీటింగ్.. మీ పార్టనర్ ఇలా చేస్తే పెద్ద మోసం చేసినట్లే…

Oknews

Leave a Comment