EntertainmentLatest News

‘పుష్ప2’ క్లైమాక్స్‌ కోసం సుకుమార్‌ ఇంత స్కెచ్‌ వేశాడా.. షాక్‌ అవుతున్న ఇండస్ట్రీ!


ఇప్పుడున్న టాలీవుడ్‌ డైరెక్టర్లలో సుకుమార్‌ది భిన్నమైన శైలి. ఇప్పటివరకు అతను చేసిన 8 సినిమాల్లో సక్సెస్‌ శాతం ఎక్కువే. అతను డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఇరవై సంవత్సరాల్లో అతను చేసిన సినిమాలు కేవలం 8 మాత్రమే. ‘ఆర్య’ నుంచి చూసుకుంటే సినిమా, సినిమాకీ మధ్య కనీసం రెండు సంవత్సరాలు గ్యాప్‌ ఉంటోంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ‘పుష్ప2’కి కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. అతను చేసిన ఎనిమిది సినిమాల్లో ‘పుష్ప’కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అతని కెరీర్‌లో అతి పెద్ద హిట్‌ ఇదే కావడం, 100 సంవత్సరాల తెలుగు చలన చిత్ర చరిత్రలో ఏ నటుడూ సాధించని ఉత్తమ నటుడు అవార్డును సాధించడంతో ‘పుష్ప’ చిత్రం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. దాంతో దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘పుష్ప2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

దానికి తగ్గట్టుగానే ‘పుష్ప2’ని మరింత భారీగా రూపొందించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తున్నారు సుకుమార్‌. ఇంతకుముందు తను చేసిన సినిమాలన్నింటికంటే ఈ సినిమాపైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేట్‌ చేస్తున్నారు. అందుకే షూటింగ్‌ కోసం ఎక్కువ టైమ్‌ తీసుకుంటున్నారు. 2022లో ప్రారంభమైన ఈ సినిమా ఇంకా షూటింగ్‌ దశలోనే ఉంది. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆగస్ట్‌ 15న రిలీజ్‌ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ, అలా జరిగే అవకాశం లేదని తెలియడానికి మేకర్స్‌కి ఎక్కువ సమయం పట్టలేదు. అందుకే రిలీజ్‌ని వాయిదా వేశారు. డిసెంబర్‌ 6న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే పర్‌ఫెక్షన్‌ పేరుతో సినిమాని చెక్కుతూ వచ్చిన సుకుమార్‌కి ఇప్పుడు మరింత టైమ్‌ దొరికినట్టయింది.  

అందుకే సినిమాని మరింత అందంగా చెక్కేందుకు రెడీ అయ్యారు. సినిమాకి ఎంతో కీలకమైన క్లైమాక్స్‌ని డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నారు సుకుమార్‌. భారీ యాక్షన్‌ సీన్స్‌తో ఉండే క్లైమాక్స్‌ను 15 రోజులపాటు చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని నటీనటులందరూ పాల్గొంటారు. సినిమాపై ఉన్న భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అవ్వాలంటే క్లైమాక్స్‌ విషయంలో మరింత కేర్‌ తీసుకోవాలని డిసైడ్‌ అయ్యారు సుకుమార్‌. అందుకే దానికోసం ఒక ప్లాన్‌ వేశారట. మొదట డమ్మీ ఆర్టిస్టులతో ఆ క్లైమాక్స్‌ని షూట్‌ చెయ్యాలన్నదే అతని ప్లాన్‌ అని తెలుస్తోంది. దాని కోసం డమ్మీ ఆర్టిస్టులతో యాక్షన్‌ సీక్వెన్స్‌లకు సంబంధించిన రిహార్సల్స్‌ చేయించి రఫ్‌గా క్లైమాక్స్‌ని షూట్‌ చెయ్యబోతున్నారట. రామోజీ ఫిలింసిటీలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులే జరుగుతున్నాయి. ఈ షూట్‌ పర్‌ఫెక్ట్‌గా వచ్చిన తర్వాతే అసలైన షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. 



Source link

Related posts

Varun Tej reveals why he married Lavanya Tripathi in Italy అందుకే లావణ్యతో ఇటలీలో పెళ్లి: వరుణ్ తేజ్

Oknews

bigg-boss-3-telugu-winner-rahul – Telugu Shortheadlines

Oknews

NTR gets a rare honour యాక్టర్స్ బ్రాండ్ లోకి తారక్

Oknews

Leave a Comment