పూజా అరెస్ట్ కు రంగం సిద్ధం? Great Andhra


వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టు తిరస్కరించింది. దీంతో ఏ క్షణానైనా పూజా ఖేడ్కర్ అరెస్ట్ అవ్వొచ్చు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అవకతవకలకు పాల్పడ్డారనేది పూజాపై ఆరోపణ. పూజ సమర్పించిన బోగస్ సర్టిఫికేట్ పై చర్యలు తీసుకున్న కమిషన్, ఆమె ట్రైనీ ఐఏఎస్ పోస్టును ఉపసంహరించుకుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఆమె యూవీఎస్సీ నిర్వహించే ఏ రకమైన పరీక్షలకు హాజరుకాకుండా నిషేధించింది.

యూపీఎస్సీకి నకిలీ అంగవైకల్య ధృవీకరణ పత్రం సమర్పించారనే ఆరోపణలపై పూజా కేడ్కర్ పై కేసు నమోదైంది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె ముందస్తు బెయిల్ కు అప్లయ్ చేసుకున్నారు. అది తిరస్కరణకు గురవ్వడంతో, పూజాను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమౌతున్నారు.

ఐఏఎస్ గా సెలక్ట్ అయ్యేందుకు యూపీఎస్సీలో కొందరు వ్యక్తులు ఆమెకు సహాయం చేశారనే ఆరోపణలున్నారు. దీనిపై పోలీసులు లోతుగా విచారణ సాగించబోతున్నారు.

మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా కేడ్కర్, తనకుతానుగా ఇరుక్కున్నారు. పూర్తిస్థాయి ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించకముందే, ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. లగ్జరీ కారును వాడడం, ప్రోటోకాల్ ను కోరుకోవడం, ఆమెను ఇరకాటంలో పెట్టాయి. దీనికితోడు ఆమె తల్లి తుపాకీతో రైతుల్ని బెదిరించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది.

ఓవైపు ఇదంతా నడుస్తుండగానే, మరోవైపు పూజా ఖేడ్కర్ సమర్పించిన పత్రాలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఆ తర్వాత ఆమె ఐఏఎస్ పోస్టింగ్ ను రద్దు చేసింది. ఆ తర్వాత కేసు పెట్టింది.

మరోవైపు పూజా ఖేడ్కర్ కేసుతో వికలాంగుల హక్కుల చట్టంలో మార్పుచేర్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇకపై వికలాంగ ధృవీకరణ పత్రాలు తప్పుదోవ పట్టకుండా ఉండేలా, మరింత పకడ్బందీగా నిబంధనల్ని రూపొందించేందుకు ఆర్పీడబ్ల్యూడీ-2016 చట్టంలోని నిబంధనల్ని సవరించేందుకు ముసాయిదాను ప్రచురించింది. దీనికి సంబంధించి త్వరలోనే కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రాబోతున్నాయి.



Source link

Leave a Comment