Entertainment

పూరి జగన్నాథ్, తరుణ్ ల డ్రగ్స్ కేసు కొట్టివేత.. FSL రిపోర్ట్ కీలకం


2018 లో  తెలుగు సినిమాని డ్రగ్స్ అంశం ఒక కుదుపు కుదిపింది.సినిమా పరిశ్రమకి చెందిన కొంత మంది సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలని ఎదుర్కొన్నారు. ఆ ఆరోపణలు ఎదుర్కున్న వారిలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రముఖ హీరో తరుణ్ కూడా ఉన్నారు. పోలీసులు మిగతా వారితో పాటు ఆ ఇద్దరి మీద  కేసు కూడా నమోదు చేసారు. అలాగే ఆ ఇద్దరు చాలా సార్లు పోలీసు విచారణలో కూడా పాల్గొన్నారు. తాజాగా ఆ కేసుకి సంబంధించిన తీర్పు వచ్చింది. 

   

హైదరాబాద్ లోని  నాంపల్లి కోర్టు పూరి జగన్నాధ్, తరుణ్ మీద ఉన్న డ్రగ్స్ కేసుని కొట్టివేసింది.అప్పట్లో పూరి అండ్ తరుణ్ బాడీ నుంచి సేకరించిన శాంపిల్స్ ని పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కి పంపించారు.ఆ శాంపిల్స్ ని పరీక్షించగా  పూరి అండ్ తరుణ్ బాడీలలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో  ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ని సాక్ష్యం గా తీసుకున్న కోర్టు  ఆ ఇద్దరి మీద ఉన్న  డ్రగ్స్ కేసుని కొట్టేసింది. ఇలా మొత్తం  8 కేసుల్లో ఆరు కేసులను ఆధారాలు లేవని  కోర్టు  కొట్టేసింది.

ఇప్పుడు ఈ వార్తలతో పూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి డ్రగ్స్ కేసులో క్లీన్ చీట్ లభించడంతో ఆయన మరింత డబుల్ ఉత్సాహాంతో తన సినిమాకి కంప్లీట్ చెయ్యడం గ్యారంటీ అని అంటున్నారు. హీరో తరుణ్ కి కూడా ఇది ఊరట ని ఇచ్చే అంశమే. ముఖ్యంగా ఈ తీర్పు తెలుగు చలన చిత్ర పరిశ్రమ పురోగతికి  ఒక మంచి పరిణామం.



Source link

Related posts

సోనూ సూద్‌ను అరెస్ట్‌ చెయ్యాలి.. వివాదాస్పద ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం!

Oknews

‘పురుషోత్తముడు’ మూవీ రివ్యూ

Oknews

వైఎస్ ఫ్యాన్స్ లో ‘యాత్ర 2’ చిచ్చు.. దారుణంగా కొట్టుకున్నారు!

Oknews

Leave a Comment