EntertainmentLatest News

పూరి జగన్నాధ్ కొడుకు పేరు ఇక నుంచి  ఆకాష్ పూరి కాదు 


దర్శకుడుగా పూరి జగన్నాధ్(puri jagannath)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన  పని లేదు.రెండు దశాబ్దాల పై నుంచి  ఎన్నో హిట్ చిత్రాలని తెరకెక్కిస్తు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు. ఇక ఆయన వారసుడు ఆకాష్ పూరి(akash puri)ఆంధ్ర పోరితో  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. లేటెస్ట్ గా ఆకాష్  తన పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం  టాక్ అఫ్ ది డే గా నిలిచింది.

ఆకాష్ లేటెస్ట్ గా ఇనిస్టా లో ఒక పోస్ట్ చేసాడు. ఇక నుంచి నా పేరు ఆకాష్ పూరి కాదు ఆకాష్ జగన్నాధ్(akash jagannath)అని మెన్షన్ చేసాడు. దీంతో ఆయన్ని ఫాలో అయ్యే వాళ్లంతా  ఓకే ఆకాష్ జగన్నాధ్  అని రిప్లై ఇస్తున్నారు. అంతే కాకుండా  సడన్  గా పేరు మార్చుకోవడం వెనుక కారణం ఏమై ఉంటుందని కూడా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పేరు మార్పుతో అయినా ఆకాష్  కెరీర్ పరంగా   ఉన్నత విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారు.అలాగే ఆకాష్  పేరు మార్చుకున్నా కూడా తన తండ్రి నీడ ని మాత్రం వదల్లేదనే మాటలు కూడా  వినిపిస్తున్నాయి. ఇటీవల మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej)కూడా తన పేరుని సాయి దుర్గ తేజ్(sai durga tej)గా మార్చుకున్నాడు. తేజ్ అమ్మగారి పేరు  దుర్గ. 

ఇక ఆకాష్ సినీ కెరీర్ ప్రస్తుతానికి అయితే అంత ఆశాజనకంగా లేదు.ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి చేసిన మెహబూబా, చోర్ బజార్, రొమాంటిక్ వంటి చిత్రాలు ప్లాప్ గా నిలిచాయి. కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఇంత వరకు రాలేదు. రామ్ చరణ్, ప్రభాస్ ల  చిరుత, బుజ్జిగాడు మేడిన్ చెన్నై ల్లో బాల నటుడుగాను ఆకాష్  మెరిశాడు.

 



Source link

Related posts

కృష్ణ వంశీ చేసే పనులు చెప్తే మీకు హార్ట్ ఎటాక్ గ్యారంటీ

Oknews

ఇండియా మొత్తం మీద ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. అమౌంట్ తెలిస్తే షాక్  

Oknews

Ram Charan conferred doctorate by the Prestigious Vels University ఈ గౌరవం నా అభిమానులది : రామ్ చ‌ర‌ణ్‌

Oknews

Leave a Comment