Health Care

పెరుగులో నీటిని కలిపి మజ్జిగ చేస్తున్నారా.. అయితే, వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!


దిశ, ఫీచర్స్: రోజూ మజ్జిగ తాగడం వల్ల మీ శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని గుణాలు పొట్ట సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. అయితే చాలా మంది ఎండా కాలంలో శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి మజ్జిగ తాగుతుంటారు. వేసవిలో రోజూ వీటిని తాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.

అంతేకాకుండా, సమ్మర్లో వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. అయితే మజ్జిగ చేసేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. దీంతో వారు అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మజ్జిగ తయారు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే,తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో నీటిని కలిపి మజ్జిగ చేస్తున్నారా?

ఈ రోజుల్లో, చాలా మంది మజ్జిగ చేయడానికి పెరుగులో నీటిని కలిపి తీసుకుంటున్నారు. కానీ ఇది మంచిది కాదని, ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెరుగుతో చేసిన మజ్జిగ తాగే వారు తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. మజ్జిగ చేయడానికి, మీరు మొదట పెరుగు నుండి వెన్నని వేరు చేయాలి. ఈ పెరుగును కవ్వంతో బాగా చిలకాల్సి ఉంటుంది. ఇలా తయారైన పలుచని పెరుగును మజ్జిగగాతీసుకోవచ్చు. ఇలా తయారుచేసిన మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.



Source link

Related posts

అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే..

Oknews

సూర్యగ్రహణాన్ని వెంటాడుతున్న NASA.. ఏప్రిల్ 8 తర్వాత ఏ రహస్యాలు బయటపెట్టనుంది..

Oknews

సొసైటీలో గౌరవాన్ని పెంచే కామన్ బిహేవియర్స్.. ఫాలో అయితేనే మంచీ.. మర్యాద!

Oknews

Leave a Comment