Health Care

పెళ్లి అంటేనే భయపడుతున్నారా?.. అదే గామో ఫోబియా!


దిశ, ఫీచర్స్ : సహజంగానే ఓ వయస్సుకు వచ్చాక పెళ్లి చేసుకోవాలనే కోరిక అందరిలో పుడుతుంది. అంతేకాకుండా వివాహాన్ని మాన జీవితంలో ఓ కీలకమైన మలుపుగా భావిస్తారు. కాబట్టి ప్రజలందరిలో ఉండే కామన్‌గా జరిగే ప్రాసెస్ ఇది. కానీ కొందరు వాళ్ల పేరెంట్స్ లేదా రిలేటివ్స్ పెళ్లి ప్రస్తావన తేగానే కంగారు పడుతుంటారు. ఏదో ఆందోళన, భయం వెంటాడుతున్నట్లు ఫీలవుతారు. దీనినే సైకాలజీ పరిభాషలో ఇప్పుడు గామో ఫోబియా (Gamophobia) అంటున్నారు. ఇది వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

ఎలా వచ్చింది?

నిజానికి గామో ఫోబియా పెళ్లిపట్ల ఉండే భయాన్ని సూచిస్తుంది. ఇది గ్రీకు భాషలోని ‘గామోస్’ (పెళ్లి) ‘ఫోబోస్’ (భయం) పదాల నుంచి వచ్చింది. కొందరు గామో ఫోబియాలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందడం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ భయంతో ఉన్నవారు పెళ్లి చేసుకున్నా హెల్తీ అండ్ రొమాంటిక్ రిలేషన్‌షిప్ మెయింటెన్ చేసే సామర్థ్యాన్ని కోల్పోయే చాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు.

కారణాలేమిటి?

సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటలనకు చలించిపోయే మనస్తత్వం, ప్రేమలో వైఫల్యం, విడాకులు, వేధింపులు, అక్రమ సంబంధాలు, ఫెయిల్యూర్ మ్యారేజెస్ వంటివి గామో ఫోబియాకు దారితీస్తాయి. తమ చుట్టూ ఉన్న సమాజంలో లేదా కుటుంబాల్లో, బంధువుల్లో ఎవరైనా వివాహం చేసుకున్నందుకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వంటివి చూడటంవల్ల ఏర్పడే అపోహల కారణంగానూ గామో ఫోబియా అనే రుగ్మతకు గురికావచ్చు. తమకూ అలాగే జరుగుతుందనే భయం వెంటాడటంవల్ల బాధితులు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. అలాగే పర్‌ఫెక్షనిజం ఎక్కువై రుగ్మతగా మారిన వ్యక్తులు కూడా పెళ్లి చేసుకుంటే తాము గోల్స్ చేరుకోవడం కష్టం అవుతుందనే సాకుతో పెళ్లి చేసుకోవడానికి భయపడుతుంటారు. కొందరిలో శారీరక లోపాలు, జనరలైజ్డ్ యాంగ్జైటీస్, ఆత్మ న్యూనతా భావాలు వంటివి కూడా పెళ్లిపట్ల భయాన్ని పెంచుతాయి.

లక్షణాలు

గామో ఫోబియా కలిగిన వ్యక్తులు పేరెంట్స్ తమకు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పినా ఒప్పుకోరు. పెళ్లి, లాంగ్ టెర్మ్ కమిట్మెంట్స్ గురించి వీరిలో ఆందోళన ఉంటుంది. అలాగే ఎవరైనా మ్యారేజ్ గురించి చర్చించడం, ప్రస్తావించడం చేస్తుంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలని లేదా టాపిక్ డైవర్ట్ చేయాలని ట్రై చేస్తుంటారు. పెళ్లి మాట ఎత్తగానే హార్ట్ రేట్, గుండె దడ పెరగడం, చెమటలు పట్టడం, వణికిపోవడం, శ్వాసలో ఇబ్బంది వంటివి ఏర్పడవచ్చు. కొందరిలో మూర్ఛ వంటివి కూడా వస్తాయి.

పరిష్కారం ఏమిటి?

గామో ఫోబియా పెళ్లి సంబంధిత అపోహలు, వైవాహిక బంధాల్లో జరిగే ప్రతికూల సంఘటనలవల్ల ఏర్పడుతుంది. కాబట్టి దీనిని కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా పోగొట్టవచ్చునని నిపుణులు చెప్తున్నారు. అలాగే పేరెంట్స్, నిపుణులు, ఇలా ఎవరైనా కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా బాధిత వ్యక్తుల్లో మార్పు రావచ్చు. బాధితులు సమాజాన్ని అబ్జర్వ్ చేయడం, అర్థం చేసుకోవడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం, సామాజిక స్పృహ అలవర్చుకోవడం వంటివి సహజంగానే ఈ ఫోబియా నుంచి బయటపడేలా చేస్తాయి. ఫ్రెండ్స్‌తో చర్చించడం, పార్టీలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లలకు అటెండ్ అవుతుండటం వంటి సందర్భాలు కూడా పెళ్లిపై ఉన్న భయాలను పోగొడతాయి.



Source link

Related posts

అదిరిపోయే గుత్తి దొండకాయ కూర రెసిపీ.. ఇలా ఈజీగా చేసేయండి

Oknews

మొబైల్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Oknews

ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినేస్తున్నారా? .. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!

Oknews

Leave a Comment