Top Stories

పెళ్లి కాకుండానే గర్భం.. కూతుర్ని తగలబెట్టిన తల్లి


ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కాకుండానే గర్భందాల్చిన కూతుర్ని కన్నతల్లి నిప్పుపెట్టింది. ఈ ఘాతుకానికి కొడుకు కూడా సహకరించాడు.

హాపూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని నెవాడా ఖుర్ద్ గ్రామంలో ఉంటున్న 21 ఏళ్ల యువతి పెళ్లి కాకుండానే గర్భందాల్చింది. దీంతో ఆమె తల్లికి కోపం కట్టలు తెంచుకుంది. గర్భానికి కారకుడైన వ్యక్తి గురించి ఆరా తీసింది. కానీ యువతి నోరు విప్పలేదు.

దీంతో యువతి తల్లి, సోదరుడు ఆమెను సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. యువతి హాహాకారాలు విని, చుట్టుపక్కల వాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి కాపాడారు. 70శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను వెంటనే మీరట్ లోని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కూతుర్ని కాల్చిచంపడానికి ప్రయత్నించిన తల్లీకొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వరకట్నం కోసం మరో యువతి బలి.. ఇదే రాష్ట్రంలో వరకట్నం కోసం మరో యువతి బలైంది. ముజఫర్ నగర్ జిల్లాలోని వజీరాబాద్ గ్రామంలో ఉంటున్న అంజలికి పెళ్లయి మూడేళ్లు అవుతోంది. అయితే అదనపు కట్నం కోసం భర్త శుభమ్ కుమార్, అతడి తల్లి అంజలిని వేధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ఆమెకు విషమిచ్చి చంపేశారు.

స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు, అంజలి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. తల్లీకొడుకు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ల కోసం పోలీసులు వెదుకుతున్నారు.



Source link

Related posts

అల్లు అరవింద్ పుత్రోత్సాహం

Oknews

బొత్స మీదనే మొత్తం భారం

Oknews

పెళ్లిపై త్రిష రియాక్షన్.. కొత్త చర్చకు దారితీసిన పోస్టు

Oknews

Leave a Comment