Entertainment

పెళ్లి కార్డు ఇవ్వటానికి వెళ్తే పెళ్లి చేసినంత పని చేసిన మోహన్ బాబు


తెలుగు సినిమా  ఉన్నంత కాలం తన పేరు చిరస్థాయిగా నిలిచేలా ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలని పోషించి ప్రేక్షకుల మెప్పుని పొందిన నటుడు పద్మశ్రీ మంచు మోహన్ బాబు. కళకి సంబంధించిన ఏ యాంగిల్ లో అయినా సరే  ఆయన డైలాగ్ చెప్తే థియేటర్ మొత్తం ఈలలు కేకలతో దద్దరిల్లిపోతుంది. తాజాగా మరోసారి తన విలక్షణమైన వ్యక్తిత్వం ఇప్పుడు టాక్ అఫ్ ది తెలుగు స్టేట్స్ గా మారింది.

దిల్ రాజు, ఆయన తమ్ముడు శిరీష్ లు తెలుగు సినీ సీమలో సక్సెస్ ఫుల్  ప్రొడ్యూసర్స్ గా కొనసాగుతు ఉన్నారు. మరికొన్ని రోజుల్లో  శిరీష్ కొడుకు ప్రముఖ హీరో అయినటువంటి  ఆశిష్ వివాహం జరగనుంది.ఇందుకు సంబంధించి తన పెళ్ళికి రావాల్సిందిగా మోహన్ బాబు ఇంటికి  ఆశిష్ తన కాబోయే శ్రీమతిని వెంట పెట్టుకొని పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాడు.పెళ్లి కార్డు అందుకున్న మోహన్ బాబు పెళ్లి రోజున తాను ఫారిన్ లో ఉంటున్నానని చెప్పి కాబోయే వధూవరులిద్దరి చేత తన ఇంటిలోని పూజ గదికి తీసుకెళ్లి దండలు  మార్పించాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో మోహన్ బాబు గార్ని పెళ్ళికి పిలవడానికి వెళ్తే  ఏకంగా చిన్న సైజు పెళ్లినే జరిపించాడు అని అందరు అనుకుంటున్నారు.  

ఇక  ఈ పెళ్ళికి సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన అందరి హీరోలకి ఆహ్వానం వెళ్ళింది. ఆశిష్ చేసుకోబోయే అమ్మాయి పేరు  అద్వేతా రెడ్డి. ఈ నెల 14న వీరివురి  వివాహం  జైపూర్ లో అత్యంత ఘనంగా జరగబోతుంది. ఆశిష్ రౌడీ బాయ్ సినిమా ద్వారా తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు, ఆయన కూతురు హర్షితా కూడా మోహన్ బాబు ఇంటికి కార్డు ఇవ్వడానికి వెళ్లిన వారిలో ఉన్నారు 

 



Source link

Related posts

అక్కడ సూపర్‌స్టార్‌.. ఇక్కడంత సీన్‌ లేదంటున్న బయ్యర్లు?

Oknews

దిల్ రాజు కథ ని బాలకృష్ణ చిన్న కూతురు ఓకే చేసిందా!

Oknews

ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Oknews

Leave a Comment