దిశ, ఫీచర్స్ : పెళ్లి సబంధాల కోసం చాలా మంది మ్యాట్రిమోనిలు మీద ఆధారపడుతున్నారు. కానీ ఇది అంత మంచిది కాదని నిపుణులు తేల్చి చెప్పేసారు. వీటిలో రెండు రకాల ఫ్రోపైల్స్ ఉంటాయి. ఒకటి ప్రీ ఫ్రోపైల్, రెండు పెయిడ్ ఫ్రోపైల్. ఫ్రీ ప్రోఫైల్ ఎప్పటి నుంచో ఉన్నది. పెయిడ్ ఫ్రోపైల్ రీసెంట్ గా అప్డేట్ చేసారు. దీనిలో మ్యాట్రిమోనికి డబ్బు కట్టి క్రియేట్ చేయించుకుంటుంది. అయితే, తాజాగా దీని మీద పరిశోధనలు చేయగా.. షాకింగ్ విషయాలు బయట పడ్డాయి.
ఎవరైనా మంచి వరుడు, మంచి వధువు రావాలని కోరుకుంటారు. కానీ, ఈ మ్యాట్రిమోనిలలో పెళ్లి కోసం అబ్బాయిలు మొత్తం ఫేక్ డిటైల్స్ పెట్టి అమ్మాయిలని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఇంతకీ తెగిస్తున్నారంటూ చెబుతున్నారు. అధికశాతం మంది ఇక్కడే మోసపోతున్నారని చెబుతున్నారు.
సోషల్ మీడియా ఇప్పుడు చాలా భయానకంగా మారింది. మీరు వారితో మాట్లాడినప్పుడు చాలా ఈజీగా దగ్గరైపోతారు. కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత సమాచారాన్ని కూడా పంచుకుంటారు. దీని వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి పొరపాటున కూడా వివరాలు ముందే చెప్పకండి.
పెళ్లి ఓకే అనగానే .. కలిసి తిరగడం.. ఆ తర్వాత అమ్మాయిని బలవంతం చేసి ఓయో రూమ్ కి తీసుకువెళ్లడం లాంటివి జరుగుతున్నాయి. మోజు తీరిపోయాక అబ్బాయిలు పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నారని ఈ పరిశోధనలో తేలింది. ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు జాగ్రత్త ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత ఫోటోలు అడ్డుపెట్టుకుని ఫ్యూచర్లో అమ్మాయిలని బెదిరించే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.