EntertainmentLatest News

‘పేక మేడలు’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘ఆడపిల్ల’ విడుదల!


‘నా పేరు శివ’, ‘అంధగారం’ తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan)ను తో హీరోగా పరిచయం చేస్తూ రాకేష్ వర్రే నిర్మిస్తున్న చిత్రం ‘పేక మేడలు’ (Peka Medalu). ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ సాంగ్ కు మంచి స్పందన లభించింది. రీసెంట్ గా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోని రెండవ సింగిల్ “ఆడపిల్ల” సాంగ్ విడుదలైంది.

“ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా ఆడదాని జన్మంతా స్వాహా” అంటూ సాగే ఈ సాంగ్ సింగర్ సాకే రాజశేఖర్ పాడగా లిరిక్స్ రాసింది భార్గవ కార్తీక్. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ చాలా ఎట్రాక్టివ్ గా కొత్తగా ఉంది. ఈ పాట వైవిద్యంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా జూలై 19న విడుదల చేస్తున్నట్టు తెలిపారు మూవీ టీం.

రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా హరిచరణ్ కె, ఎడిటర్ గా సృజన అడుసుమిల్లి, హంజా అలీ వ్యవహరిస్తున్నారు.



Source link

Related posts

బల్కంపేట్ ఎల్లమ్మ గుడిలో మృణాల్ పూజలు

Oknews

రూపాన్ని మార్చుకోవడం కోసం ఆస్ట్రేలియాకు రామ్ చరణ్!

Oknews

Numaish Exhibition At Nampally Ground Ended On Sunday

Oknews

Leave a Comment