మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ మాటలు
రెండేళ్ల క్రితం పిల్లలకు సహాయం చేసేందుకు తల్లితండ్రులతో కలిసి క్యాన్సర్ ఆస్పత్రికి ఆకర్షణ వెళ్లగా అక్కడ కొంత మంది పిల్లలు “కలరింగ్ బుక్స్” అడిగారు. దీంతో అప్పటి నుంచి ఆకర్షణ రకరకాల పుస్తకాలు సేకరించి పిల్లల కోసం ఒక్కో లైబ్రరీ ఏర్పాటు చేస్తూ మొత్తానికి 7 లైబ్రరీలు హైదరాబాద్ లో నడుపుతుందని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో తెలిపారు. ఆమె తన ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు, స్నేహితుల నుంచి పుస్తకాలను సేకరించి క్యాన్సర్ ఆసుపత్రిలో పిల్లల కోసం మొదటి లైబ్రరీ ప్రారంభించిందన్నారు .పేద పిల్లల కోసం వివిధ ప్రదేశాలలో ఇప్పటి వరకు ప్రారంభించిన ఏడు లైబ్రరీలలో ఇప్పుడు సుమారు 6 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో చిన్నారి ఆకర్షణ విశేష కృషి చేస్తున్న తీరు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని ప్రధాని మోదీ కొనియాడారు