ByGanesh
Thu 29th Feb 2024 11:21 AM
బాలీవుడ్ క్రేజీ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు. 2018 నవంబర్ 14న ఇటలీలో పెళ్లి చేసుకున్న రణవీర్ సింగ్-దీపికా పదుకొనె లు తల్లిదండ్రులు కాబోతున్న వార్త వాళ్ళ ఫాన్స్ ని నిలువనియ్యడం లేదు. దీపికా-రణవీర్ ఇద్దరూ పెళ్లి తర్వాత ఎవరి కెరీర్ ల మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఈలోపులో దీపికా స్టార్ డమ్ మరింతగా పెరిగిపోయింది. దానితో రణవీర్ సింగ్-దీపికా పదుకొనె మధ్యన విభేదాలు తలెత్తాయి.. వీరివురూ విడిపోతున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
కానీ వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నామంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కలిసి కనిపించి ఆ విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టేవారు. ఇక అభిమానులు వీరు చెప్పబోయే గుడ్ న్యూస్ కోసం, దీప్‌వీర్ వారసులు కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దీపికా ప్రెగ్నెంట్ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇన్నాళ్ళకి అభిమానుల కోరిక నెరవేరింది. తమ మొదటి బిడ్డకి ఆహ్వానం పలుకుతున్నట్లు దీపికా పడుకోణె, రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు.
అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ లో ఒక గ్రీటింగ్ నోట్ పోస్ట్ చేశారు. ఆ పోస్టులో బేబీకి సంబంధించిన డ్రెస్సులు కనిపిస్తున్నాయి. అలాగే సెప్టెంబర్ 2024 అని రాసి ఉంది. అంటే సెప్టెంబర్ లో దీపికాకి డెలివరీ అవుతుందని ఈ గ్రీట్ కార్డు లోనే దీప్‌వీర్ హింట్ కూడా ఇచ్చేసారు.
Deepika Padukone and Ranveer Singh are expecting their first child :
Deepika Padukone and Ranveer Singh are expecting their first child in September, 2024