పాడి పై కాంగ్రెస్ కస్సుబస్సుమంత్రి పొన్నం ప్రభాకర్ ను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Ponnam vs Padi) విమర్శించడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎమ్మెల్సీగా, విప్ గా పని చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి సబ్జెక్టు నాలెడ్జ్ లేకుండా చైల్డ్ మెంటాల్టితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలే ఉరికిచ్చి కొడుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. పొన్నంపై కౌశిక్ విమర్శలు, పాడి పై కాంగ్రెస్ నేతల ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
Source link