పోసాని కృష్ణ మురళి.. తన కథలతో, కథనంతో,మాటలతో తెలుగు సినిమాకి నూతన సొగసులని, ఉత్తేజాన్ని తీసుకొచ్చిన ఒక గొప్ప రచయిత. అంతటితో ఆగకుండా దర్శకుడు గా సామాజిక ప్రయోజనం తో కూడిన సినిమాలని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు. ఆ తర్వాత నటుడిగా కూడా మారి విజృంభించాడు. ఎంతలా అంటే పోసాని కోసమే సినిమాకి వెళ్లేంతలా. కానీ పాలిటిక్స్ వల్ల ఆ వైభోగానికి బ్రేక్ పడింది.మళ్ళీ అలనాటి వైభోగం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా
1993 లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమా కి డైలాగ్స్ ని అందించడం ద్వారా పోసాని సినీ రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత వచ్చిన పోలీస్ బ్రదర్స్ ద్వారా పూర్తి స్థాయి రచయితగా మారాడు. అల్లుడా మజాకా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, మాస్టర్, లాంటి చిత్రాల విజయాలతో స్టార్ రైటర్ గా గుర్తింపుని సంపాదించాడు. పోసాని మా సినిమాకి రచయితగా పని చెయ్యాలని కోరుకుని హీరో లేడంటే అతిశయోక్తి కాదు.ఇక అసలు విషయానికి వస్తే వైసిపీ అధినేత జగన్ కి పోసాని వీర విధేయుడు. ఆ పార్టీ జెండా కూడా కప్పుకుని జగన్ ని ఎవరైనా ఏమైనా అంటే నోరొచ్చుకుని పడిపోతాడు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని, ఉప ముఖ్యమంత్రి పవన్ మీద చాలా దారుణమైన విమర్శలు చేసాడు. వ్యక్తి గతంగా కూడా విమర్శలు చేసి అభాసుపాలు అయ్యాడు. అసలు వాటిని ఎవరు ఆక్షేపించరు కూడా. మరి ఇప్పుడేమో వైసిపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. పైగాఇక కోలుకోవడం అనేది అసాధ్యం. సో పోసాని రాజకీయంగా ఖాళీగా ఉంటాడు. మరి ఈ పరిస్థితుల్లో తన జన్మ స్థలం సినిమాల్లోకి వస్తే మేకర్స్ ఆహ్వానిస్తారా అనేది అనుమానమే.
ఎందుకంటే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం వైపు సినిమా వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతారు.ఎందుకంటే సినిమాకిఉన్న శక్తిని ప్రపంచానికి తెలియచేసింది ఆయనే. ఇక అగ్నికి ఆజ్యం జోడయినట్టు జనసేన కూడా సినీ నటుడు పవన్ దే కావడం వల్ల పోసానికి అవకాశం అనేది కష్టమే.అంతిమంగా సినిమా గొప్పది కాబట్టి తనకి కావాల్సిన వన్నీ తన దగ్గరికే తెచ్చుకుంటుంది కాబట్టి పోసానికి అవకాశాన్ని కల్పిస్తుందేమో చూడాలి. కృష్ణం వందే జగద్గురం, నాయక్, అత్తారింటికి దారేది, ఖైదీ నెంబర్ 150 , టెంపర్ లాంటి సినిమాలతో స్టార్ నటుడు గా మారాడు.