Top Stories

పోస్టర్ వచ్చింది.. డేట్ మాత్రం రాలేదు


లెక్కప్రకారం ఈ పాటికే గుంటూరు కారం సినిమా నుంచి సాంగ్ రావాలి. అది రాలేదు. కనీసం ఎనౌన్స్ మెంట్ అయినా రావాలి. అది కూడా రాలేదు. ఇక మిగిలిన ఒకే ఒక్క అకేషన్ దసరా. పండక్కి గుంటూరుకారం సాంగ్ అప్ డేట్ ఇస్తారని అంతా ఎదురుచూశారు.

నిర్మాత నాగవంశీ మాటలు ఈ ఎదురుచూపులు మరింత పెరిగేలా చేశాయి. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఈ నిర్మాత, దసరా టైమ్ లో సాంగ్ అప్ డేట్ ఇస్తామని ప్రకటించాడు. కానీ గుంటూరు కారం నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు.

దసరా శుభాకాంక్షలు చెబుతూ మహేష్ బాబు కొత్త స్టిల్ విడుదల చేసిన యూనిట్, సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే తేదీని మాత్రం వెల్లడించలేదు. పుండు మీద కారం జల్లేలా 'త్వరలోనే ఫస్ట్ సింగిల్' అని మాత్రం పోస్టర్ పై వేశారు.

ఇన్నాళ్లూ సాంగ్ అప్ డేట్ కోసం ఎదురుచూసిన మహేష్ ఫ్యాన్స్, ఈ దసరాకు కనీసం కొత్త పోస్టరైనా వచ్చింది, అదే పదివేలు అంటూ సర్దుకుపోతున్నారు. సాంగ్ కంప్లీట్ గా రెడీ అయింది, కానీ ఎందుకు డేట్ ప్రకటించలేదనేది యూనిట్ కే తెలియాలి.

తాజా సమాచారం ప్రకారం.. గుంటూరుకారం సాంగ్స్ ను నవంబర్ నుంచి విడుదల చేస్తారట. మినిమం గ్యాప్స్ లో 3 సాంగ్స్ విడుదల చేసి, సంక్రాంతి రిలీజ్ కు వెళ్లాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడే విడుదల చేస్తే, ఎర్లీగా సాంగ్స్ ఇచ్చినట్టవుతుందని యూనిట్ భావిస్తోంది.



Source link

Related posts

మరో కలకలం.. జూనియర్ ఎన్టీఆర్ పై మళ్లీ ఫ్లెక్సీ

Oknews

వైసీపీలో ఈ భ‌యాన్ని కాద‌న‌గ‌ల‌రా?

Oknews

అన్న ప్రభుత్వం మీద విశాఖలో తొలి నిరసన…!

Oknews

Leave a Comment